మంబాపూర్‌లో వైద్య పరీక్షలు


Mon,November 18, 2019 11:53 PM

పెద్దేముల్‌: మండల పరిధిలోని మంబాపూర్‌ గ్రామ పంచాయతీ ఆవరణలో సోమవారం సంపూర్ణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హెచ్‌ఐవీ నిర్థారణ పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయగా సర్పంచ్‌ శ్రావణ్‌ కుమార్‌ ప్రారంభించారు. డిసెంబర్‌- 01 ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు వివిధ గ్రామాల్లో సంపూర్ణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా హెచ్‌ఐవీ నిర్థారణ పరీక్షల శిబిరాలను ఏర్పాటు చేసి ఎయిడ్స్‌ వ్యాధి గ్రాస్తులను గుర్తించడం జరుగుతుందని మేనేజర్‌ హరికృష్ణ అన్నారు. అందులో భాగంగా సుమారు 18 నుంచి 50 ఏండ్ల వయస్సు కలిగిన 66 మందికి హెచ్‌ఐవీ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా అందులో 02 పాజిటివ్‌ కేసులను గుర్తించడం జరిగిందని, హెచ్‌ఐవీ అనేది ప్రాణాంతకమైన వ్యాధి అని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉమ, సంస్థ ప్రతినిధులు నవనీత, క్రిష్ణవేణి, అనురాధ, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles