నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలి


Mon,November 18, 2019 11:53 PM

పెద్దేముల్‌: విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించాలని మండల ఎంపీపీ టి.అనురాధ అన్నారు. సోమవారం మండల పరిధిలోని మారేపల్లి గ్రామ సమీపంలోగల కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని మండల జడ్పీటీసీ, వైస్‌ ఎంపీపీ, స్థానిక ఎంపీటీసీలతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనం, మూత్రశాలలు, తరగతి గదులను పరిశీలించి, ఉపాధ్యాయుల, విద్యార్థినుల హాజరు, విద్యా బోధన తదితర అంశాల గురించి విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం బాలికల చదువుల దృష్ట్యా శ్రద్ధ వహించి వారి విద్యాభివృద్ధి కోరకు కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో నాణ్యమైన విద్యా బోధనతోపాటు, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నదన్నారు. పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థుల చదువులపట్ల ప్రత్యేకంగా 100% ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యార్థినులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని కోరారు. విద్యార్థినులు కష్టపడి చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరును తీసుకురావాలని కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహ పంక్తి భోజనం చేసి, తెలంగాణ ప్రభుత్వం బాలికలకు అందిస్తున్న హైజీన్‌ కిట్‌లను పంపిణీ చేయడం జరిగింది.

22
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...