రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం


Mon,November 18, 2019 11:52 PM

బొంరాస్‌పేట : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని దుద్యాల, బొంరాస్‌పేట గ్రామాల్లో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ రైతులు కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందిస్తామని, ప్రతి రైతుకు రైతుబంధు, రైతుబీమా సహాయం అందే విధంగా చూస్తామని అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం రైతుల కోసం, పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో పేదింటి ఆడబిడ్డలకు భరోసా కల్పిస్తున్నదని అన్నారు. మండలంలోని ఏర్పుమళ్ల, బాపల్లితండా, బురాన్‌పూర్‌ తదితర గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న భూముల సర్వేను త్వరలో పూర్తిచేసి నెల రోజుల్లో ప్రతి రైతుకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. గత నెలలో ప్రభుత్వం చేపట్టిన 30రోజుల కార్యాచరణ ప్రణాళికతో గ్రామాలు స్వచ్ఛ గ్రామాలుగా మారాయని, ఇది నిరంతరం జరిగే కార్యక్రమమని, ప్రజలు దీనిలో భాగస్వాములై తమ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి కోరారు.

రోడ్డు కబ్జాను విడిపించాలి
దుద్యాల నుంచి అల్లికాన్‌పల్లికి వెళ్లే రోడ్డును కొందరు కబ్జా చేశారని, దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని కొందరు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సర్వే చేసి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూములకు సంబంధించిన సమస్యలపై కూడా రైతులు వినతిపత్రాలు అందజేశారు. దుద్యాల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విశ్రాంత రైల్వే టీటీఐ రాములునాయక్‌ పెన్నులు, రైటింగ్‌ ప్యాడ్లు, నోటు పుస్తకాలను అందజేశారు. వీటిని ఎమ్మెల్యే విద్యార్థులకు పంపిణీ చేశారు. పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్‌ఎంపీపీ నారాయణరెడ్డి, సర్పంచ్‌ మహ్మద్‌ ఖాజా, ఎంపీటీసీలు ఎల్లప్ప, సుదర్శన్‌రెడ్డి, వెంకటమ్మ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు చాంద్‌పాషా, నాయకులు కోట్ల యాదగిరి, రమణారెడ్డి, రామకృష్ణయాదవ్‌, నరేష్‌గౌడ్‌, డిప్యూటీ తహసీల్దార్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...