పేదరికాన్ని ఎదిరించి..లక్ష్యాన్ని సాధించాడు..


Sun,November 17, 2019 11:59 PM

కొడంగల్, నమస్తే తెలంగాణ : లక్ష్యాన్ని సాధించేందుకు పేదరికం అడ్డుకాదని నిరూపించి హిమాలయ పరత్యాన్ని అధిరోహించి తెలంగాణకే వన్నెతెచ్చి న యువకుడు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ వాసి అని చెప్పుకోవడం తల్లిదండ్రులకే కాదు ఈ ప్రాంత వాసులకు గర్వకారణం. సమాజంలో డబ్బు ఉన్నవాడే అన్నింటిలో రాణిస్తాడనే అపోహను తొలగించే దిశగా పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని బొంరాస్‌పేట మండలంలోని సత్తర్‌కుంట తం డాకు చెందిన బాల్‌రాం రాథోడ్ నిరూపించాడు. మారుమూల ప్రాంత వాసి హిమాలయ పర్వత రేనాక్ శిఖరాన్ని, కిలిమంజారో, ఎల్‌బ్రోస్ పర్వతాలను అధిరోహించడాన్ని గర్వంగా పేర్కొంటూ జన నీరాజనంతో పాటు సన్మానాలు అందుకొంటున్నాడు. పలు విషయాలను నమస్తే తెలంగాణతో తన అనుభవాలను పంచుకున్నారు.
పిల్లల భవిష్యత్ కోసం వలస కూలీగా..
వికారాబాద్ జిల్లాలలోని కొడంగల్ నియోజకవర్గ బొంరాస్‌పేట మండలంలోని సత్తర్‌కుంట తండాకు చెందిన రూప్యానాయక్‌కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. కాగా స్వగ్రామంలో ఉపాధి లభించకపోవడంతో ఏ విధంగానైనా కన్న పిల్లలను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాలనే ఉన్నతమైన ఆశయంతో మహారాష్ట్రలోని ముంబాయి నగరంలో మేస్త్రీగా కూలి పనుల చేసుకొంటూ పిల్లల చదువుకు దోహదపడ్డాడు. వచ్చిన కూలీ డబ్బులను సగం కడుపుకు తింటూ పిల్ల ల ఉన్నతికి పాటుపడ్డారు. పెద్ద కుమారుడు ప్రస్తుతం సివిల్ పరీక్షలకు సిద్ధపడుతుండగా, రెండో కుమారుడే బల్‌రాం రాథోడ్ సాహసయాత్రకు పునుకున్నాడు.

తనకంటు ప్రత్యేక స్థానం ఏర్పారుచుకోవాలని..
హైదరాబాద్‌లో డిగ్రీ విద్యను అభ్యసించి సమాజంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానా న్ని సాధించుకునే లక్ష్యంతో అన్వేషించి తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, భువగిరి పట్టణంలో శేఖర్‌బాబు కోచ్ నేతృత్వంలో పర్వత రోహనంలో ట్రైనింగ్ పొందాడు. ఆ తరువాత హిమాలయ పర్వత ప్రాంతంలోని రేనాక్ శిఖరాన్ని అధిరోహించేందుకు తెలంగాణ ప్రాంతం నుంచి ఈయనతో పాటు నల్గొండకు చెందిన వెంకటేశ్, ఖమ్మం జిల్లాకు చెంది న అరుణ్‌లు కలిసి 16నవంబరు 2017 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు సహసోపేతంగా రేనాక్ శిఖరాన్ని అధిరోహించారు. రేనాక్ శిఖరాన్ని సముద్ర ఉపరితలం నుంచి 16,606ఫీట్ల ఎత్తైన పర్వతాన్ని అధిరోహించడం సాహసోపేత యాత్రగా పేర్కొన్నారు. శరీరం గడ్డ కట్టే దిశతో వాతావరణం నెలకొని ఉంటుందని, 20 రోజు ల పాటు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని రేనాక్ శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ ఎస్టీ వెల్పెర్ బ్యానెర్‌ను ఆవిష్కరింనట్లు తెలిపారు.

హిమాలయ మౌంటనీ రింగ్ ఇనిస్టిట్యూట్, డార్జిలింగ్ (వెస్ట్ బెంగాల్) వారిచే ఏ గ్రేడు సర్టిఫికెట్‌ను అందుకున్నట్లు తెలిపాడు. 20 రోజుల పాటు పడ్డ కష్టాలు పర్వతం ఎక్కి జెండాను ఆవిష్కరించే సరికి అన్నింటిని మర్చిపోయి లక్ష్యాన్ని చేరుకున్నాననే సంతోషం ఏర్పడిందన్నాడు. పర్వత రోహణంలో ఎంతోమంది తోడు ఉన్న తెలంగాణ నుంచి ముగ్గురం కలిసి కట్టుగా పర్వతాన్ని అధిరోహించడం జరిగిందన్నాడు. చిరు ప్రాయంలోనే అరుదైన స్థానాన్ని అందుకోవడం చాలా గర్వంగా ఉందని, హిమాలయ పర్వతం దేశ పటంలో చూడటమే, కానీ నేడు ఆ పర్వతాన్ని అధిరోహించడం ఆశ్యర్యంగా ఉందన్నారు. అదే విధంగా ఆ సంవత్సరంలోనే ఆఫ్రి కా ఖండంలోని టాంజానీయా దేశంలో 5895 మీట ర్ల ఎత్తున్న కిలిమంజారో పర్వతం అధిరోహించనట్లు తెలిపారు. ఆఫ్రికా ఖండంలో అతి ఎత్తైన పర్వతంగా అది ఉంటుందని అన్నాడు. 2018సంవత్సరంలో యూరఫ్ ఖండంలోని అతి ఎత్తైన పర్వతం ఎల్‌బ్రోస్ పర్వతాన్ని అధిరోహించనట్లు తెలిపారు. ఇది రష్యా ప్రాతంలో ఉందని, దీని ఎత్తు 5642మీటర్ల ఎత్తు ఉంటుందని తెలిపారు. ఓ సాధారణ వ్యక్తి ఇంతటి సాహసోపేత యాత్రను కొనసాగించాడని పలువురు ప్రశంసిస్తుంటే ఆనందానికి అవధులు లేకుండా పోయాయని తెలిపాడు.

లాఖో ఖాంగ్సే పర్వతం అధిరోహణ
ఈ మధ్య కాలంలో నార్త్ సిక్కిం అనగా చైనా వార్డర్‌లోని లాఖో ఖాంగ్సే పర్వతాన్ని అధిరోహించినట్లు తెలిపాడు. ఆసియాలోనే అతి ఎతైన పర్వతాల్లో ఒకటి లాఖో ఖాంగ్సే పర్వతంగా పేర్కొన్నాడు. ఈ పర్వతాన్ని ఎక్కడానికి మొత్తం రూ. 2లక్షల వ్యయం కావాల్సి ఉండగా రిలియన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ ఆర్థిక సహాయాన్ని అందించడంతో పర్వతాన్ని అధిరోహించే ఆస్కారం ఏర్పడినట్లు తెలిపారు.
ముఖేశ్ అంబాని మెలు మర్వలేనిది
ఆసియాలోని ఎత్తైన పర్వతాల్లో ఒకటైన లాఖో ఖాంగ్సే పర్వతం అధిరోహించేందుకు 15 రోజుల పాటు మంచు ప్రాంతంలో ప్రాక్టిస్ చేయడం జరిగింది. మొత్తం నెల రోజుల క్యాంపులో శిక్షణ పొందాను. ఈ శిక్షణతో ప్రపంచంలోని అన్ని ఎత్తైన పర్వతాలను అధిరోహించే అర్హత సాధించడం జరిగింది. ప్రోత్స హం అందించిన రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు.
- బల్‌రాం రాథోడ్, సత్తర్‌కుంటతండ, బొంరాస్‌పేట

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...