పట్టణాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతా


Sun,November 17, 2019 11:59 PM

-మినీ ట్యాంక్ బండ్‌గా శివసాగర్ చెరువు
- బ్లాక్ గ్రౌండ్‌లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
- ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం
-ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్, నమస్తే తెలంగాణ : పట్టణానికి సమీపం లో ఉన్న శివారెడ్డిపేట శివసాగర్ చెరువును మినీ ట్యాంక్‌బండ్, వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్‌ను క్రీడాకారులకు సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆన ంద్ తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే మున్సిపల్ అధికారు లు, టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి అభివృద్ధి చేసేందుకు ప రిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్ట ణ ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యవంత ంగా శివారెడ్డిపేట శివసాగర్ చెరువును మి నీ ట్యాంక్ బండ్‌లా తయారు చేసే ందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా క్రీడాకారు ల కోసం ఉన్నటువంటి బ్లా క్ గ్రౌండ్‌ను అ న్ని విధాలుగా సౌకర్యాలతో తీర్చిదిద్దేందు కు కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా వాకిం గ్ ట్రాక్ తదితర ప నులు చేపట్టి అభివృద్ధి చేస్తామని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు ప్రభాకర్‌రె డ్డి, అనంత్‌రెడ్డి, విజయ్‌కుమార్, ముత్తహార్‌షరీఫ్, కమాల్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, రాంరెడ్డి, మున్సిపల్ డీఈ పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles