ఎస్సీ కార్పొరేషన్ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి


Sat,November 16, 2019 11:24 PM

-కార్పొరేషన్ ఈడీ బాబూ మోజస్
బొంరాస్‌పేట : నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే రాయితీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబూ మోజస్ అన్నారు. శనివారం మండలంలోని బురాన్‌పూర్‌లో కార్పొరేషన్ రుణాలపై యువత, ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పొందడానికి కార్పొరేషన్ రాయితీపై రుణాలు అందిస్తుందని వీటిని సద్వినియోగం చేసు కుని ఆర్థికంగా ఎదుగాలని సూచించారు. రుణాలను పొందడానికి అర్హత 10వ తరగతి ఉత్తీర్ణత, రైతులు రెండున్నర ఎకరాల పొలం కలిగి ఉండాలని అన్నారు. రుణాలు పొంద డం, తిరిగి చెల్లించడం, రాయితీ, ఎటువంటి యూనిట్లు ఎంచుకోవాలి వంటి అంశాలపై ఆయన వివరించారు. రైతులు కూరగాయల తోటలు సాగు చేయడానికి కూడా రుణాలు ఇస్తామని ఈడీ తెలిపారు. భూములను ఎవరైనా అమ్మడానికి సిద్ధంగా ఉంటే వాటిని మార్కెట్ విలువ ప్రకారం కొనుగోలు చేసి భూమిలేని నిరుపేదలకు భూములు పంపిణీ చేస్తామని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ సుదర్శన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గ్రామస్తులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles