మెథడిస్టు జాతరకు పెరిగిన రద్దీ


Sat,November 16, 2019 11:24 PM

ధారూరు : ధారూరు మెథడిస్టు జాతరకు రోజు రో జుకు యాత్రికుల సంఖ్య భారీగా పెరుగుతుంది. శనివారం ఐదో రోజు కావడంతో యాత్రికుల సంఖ్య 2 లక్షలకు పైగా పెరిగింది. యాత్రికులు కొవ్వత్తులు వెలిగించి శిలువ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ఇప్పచెట్టుకు తాకి ప్రార్థనలు చేశారు. వికారాబాద్ జిల్లా ధారూరు లో జరిగే మెథడిస్టు జాతర ఆసియా ఖండంలో అతి పెద్ద జాతరగా పిలువబడుతుంది. ఈ జాతరకు జిల్లా నుంచే కాకుండా వివిధ జిల్లాలు, రాష్ర్టాల, దేశ విదేశాల్లో నుంచి యాత్రికులు భారీగా తరలివస్తారు. జాతర ప్రాంగణంలో అధికారులు 32సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. యాత్రికులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు జాతరను పర్యవేక్షిస్తున్నారు. అనంతరం జాతరకు వచ్చిన యాత్రికులు ఇప్పచెట్టు దగ్గరున్న సిలువ వద్ద ప్రార్థనలు చేసి కొవ్వొత్తులు వెలిగించారు. జాతర ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా సుమారు 40చెత్తకుండీలను ఏర్పాటు చేశారు. యాత్రికులు వాహనాలు నిలిపేందుకు 7పార్కింగ్ కేంద్రాల ను ఏర్పాటు చేశారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు, పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ధారూరు సీఐ రాజశేఖర్ జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ కం ట్రోల్ రూమ్‌లో యాత్రికుల కదలికలను పరిశీలించారు. వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు జాతర పరిస్థితితులను ఎప్పటికప్పుడు పోలీస్ సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles