కొనసాగుతున్న అనంతగిరి జాతర


Sat,November 16, 2019 11:24 PM

-ఉసిరి చెట్టుకి పూజలు, కార్తిక దీపాలు వెలిగించిన మహిళలు
-అన్నదానం ఏర్పాటు చేసిన ఎంపీ రంజిత్ రెడ్డి
వికారాబాద్ రూరల్ : అనంత పద్మనాభ స్వామి కార్తికమాస జాతర కొనసాగుతుంది. శనివారం స్వా మివారిని దర్శించుకునేందుకు దూరప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. అనంతుని సన్నిధిలోని గుం డం వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. కోరిన కోరికలు నేరవేర్చి, సిరి సంపదలను అనంతస్వామి కలిగిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. భక్తులు స్వామివారి తలనీలాలు సమర్పించారు. అలాగే గుండం దగ్గరలో ఉన్న గుర్రపు శాలలల్లో పలువురు సేద తీరారు. జాతరకు వచ్చిన భక్తులు రామచిలక జాతకలను చూపించుకున్నారు. స్వామివారి సన్నిధిలో సాముహిక సత్యనారయణ వ్రతాలు నిర్వహించారు.
జాతరలో అన్నదాన కార్యక్రమం
అనంత పద్మనాభస్వామి జాతర కు వచ్చిన భక్తులకు ఎంపీ రంజీత్‌రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. మూడు రోజులు అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. వచ్చిన భక్తులకు వికారాబాద్ జడ్పీ చైర్‌పర్సన్ సునీత మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, వికారాబా ద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌లు భక్తులకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ సునీతమహేందర్‌రెడ్డి మాట్లాడుతూ అనంతగిరి పద్మనాభక్షేత్రం పుణ్యక్షేత్రంగా విరజిల్లుతుందన్నారు. అధి క సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుందని, వచ్చిన భక్తులకు సదుపాయాలు కల్పించాలన్నారు. అన్నిదానాల కంటే అన్నదానం గొప్పదని తెలిపారు. జాతర సమయంలో చెత్తచెదారం ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదని తెలిపారు. ప్లాస్టిక్ నివారించేందుకు అందరూ సహకరించాలన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles