గ్రంథాలయాలు జ్ఞాన సముపార్జనకు నిలయాలు


Fri,November 15, 2019 11:27 PM

-జిల్లా విద్యాధికారి రేణుకాదేవి
వికారాబాద్ రూరల్ : గ్రంథాలయాలు జ్ఞానం సంపాదించుకునేందుకు నిలయాలని, ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలకు వెళ్లి పుస్తక పఠనం చేసి జ్ఞానులగా మారాలని వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని 52వ జాతీయ జిల్లా గ్రంథాలయా ల వారోత్సవాల్లో భాగంగా గ్రంథాలయాన్ని పరిశీలించారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 6,7వ తరగతి విద్యార్థులకు సమాజ నిర్మాణంలో గ్రంథాలయాల పాత్ర అనే అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ప్రదర్శనకు ఉంచిన పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రేణుకాదేవి మాట్లాడుతూ గ్రంథాలయాలు ఉండడం ద్వారా మంచి సమాజం ఏర్పడుతుందన్నారు. విద్యను అర్జించే వారికి గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...