చెరువులో చేప పిల్లలను వదిలిన కలెక్టర్


Fri,November 15, 2019 11:27 PM

బొంరాస్‌పేట : మండలంలోని ఏర్పుమళ్ల కాకరవాణి ప్రాజెక్టులో కలెక్టర్ శుక్రవారం చేప పిల్లలను వదిలారు. బొచ్చ, రవూ, కొరమీను వంటి రకాల 1.22లక్షల చేప పిల్లలను ఆమె చెరువులో వదిలారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ చేప పిల్లల పెంపకం వల్ల మత్య్సకారులు ఉపాధి పొందాలని సూచించారు. కాక్రావాణి ప్రాజెక్టు ప్రాముఖ్యతను వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి కలెక్టర్‌కు వివరించారు. మత్స్య సహకార సంఘంలో తాము కూడా సభ్యులుగా ఉన్నామని, ప్రాజెక్టులో చేపలు పట్టుకోవడానికి తమకు కూడా అవకాశం ఇవ్వాలని దోమ మండలం బుద్లాపూర్ గ్రామానికి చెందిన కొందరు కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, జడ్పీటీసీ చౌహన్ అరుణాదేశు, జిల్లా మత్స్యశాఖ ఏడీ దుర్గా ప్రసాద్, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు రాములు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...