బాల్యం ఎంతో విలువైనది.. వృథా చేయొద్దు


Fri,November 15, 2019 11:27 PM

-జాయింట్ కలెక్టర్ అరుణకుమారి
వికారాబాద్, నమస్తే తెలంగాణ : బాల్యంలో క్రమ శిక్షణతో విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్న శిఖరాలకు చేరుకోవాలని జాయింట్ కలెక్టర్ అరుణకుమారి తెలిపారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవన్‌లో బాలల హక్కుల వారోత్సవాలను జిల్లా మహిళా శిశుసంక్షేమ, వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జేసీ అరుణకుమారి మాట్లాడుతూ బాల్యం ఎంతో విలువైనటువంటిదని తెలిపారు. చిన్నారులు క్రమశిక్షణతో విద్యాబుద్ధులతో పాటు ఆట, పాటలతో అన్ని రంగాల్లో రానించాలన్నారు. చిన్న తనంలో మెరుగైనటువంటి ప్రతిభ కనబర్చినప్పుడే భవిష్యత్‌లో రానించేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. విద్యార్థులు వారికి అభిరుచిగల విద్యా, ఆటలు ఇతర రంగాల్లో ప్రతిభ చాటి పరినతి సాధిం చి భవిష్యత్‌లో గొప్ప వ్యక్తులుగా ఎదుగాలన్నారు. మన ప్రభుత్వం బాలల హక్కులను కాపాడేందుకు కట్టుదిట్టమైన చట్టాలను తీసుకరావడం జరిగిందని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధికి గురుకులాలను మోడల్ స్కూల్‌లను ప్రభుత్వ పాఠశాలలో మధ్యా హ్న భోజనాన్ని ఏర్పాటు చేసి గ్రామీణప్రాంత విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు గొప్పగా రానించాలన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా విద్యాబుద్ధులు నేర్చుకొని తల్లిదండ్రులకే కాకుండా ఈ ప్రాంతానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేలా కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో బాల్యం ఎంతో ముఖ్యమైనటువంటిదని, మళ్లీ తిరిగి రాదని బాల్య దశలో ఉన్నప్పుడే భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకునేలా బాల్యదశను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మహి ళా శిశు సంక్షేమాధికారి జోత్స్న, వివిధ శాఖల అధికారులు నరేశ్, శ్రీనివాస్, మహేశ్ సఖీ కేంద్రం నిర్వాహకులు తదితరులు ఉన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...