లీగల్ గార్డియన్ షిప్ సర్టిఫికెట్ కావాల్సిన వారు


Fri,November 15, 2019 11:26 PM

-దరఖాస్తు చేసుకోవాలి : కలెక్టర్
రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ: నేషనల్ ట్రస్ట్ యాక్ట్ ప్రకారం 18 ఏండ్లు నిండిన మానసిక, సెరిబ్రల్‌పాల్సీ, అటిజం, బహుళమైన బాధితులు లీగల్ గార్డెయన్‌ను పొందేందుకు అవకాశం ఉందని ఇన్‌చార్జి కలెక్టర్ హరీశ్ అన్నారు. లీగల్ గార్డియన్ షిప్ సర్టిఫికెట్ కావాల్సినవారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. నేషనల్ ట్రస్ట్ లోకల్ లెవల్ కమిటీ (ఎల్‌ఎల్‌సీ) సమావేశం నిర్వహించారు. జనపాటి రఘురాం అనే 27 ఏండ్ల మానసిక దివ్యాంగుడికి లీగల్ గార్డియన్ షిప్ సర్టిఫికెట్ అందజేశారు. ఇక నుంచి జనపాటి రఘురాం అనే మానసిక దివ్యాంగుడి తరపున ఆయన తల్లిదండ్రులు సావిత్రి, హరిప్రసాద్‌లు లీగల్ గార్డియన్లుగా వ్యవహరించడానికి కలెక్టర్ ఆధ్వర్యంలో ఎల్‌ఎల్‌సీ చట్టపరమైన అనుమతులు మంజూరుచేసింది.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...