సాఫీగా ఆర్టీసీ ప్రయాణం


Fri,November 15, 2019 11:26 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో వివిధ ప్రాంతాలకు బస్సులు నడుస్తున్నాయి. శుక్రవారం ఆర్టీసీ కార్మికులు 42వ రోజు విధులకు హాజరు కాకుండా సమ్మెను యథావిధిగా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని 3 బస్‌డిపోల నుంచి హైదరాబాద్, మెహదీపట్నంతో పాటు మహబూబ్‌నగర్, సదాశివపేట, శంకర్‌పల్లి, వికారాబాద్, తాండూరు, పరిగి ప్రాంతాలకు పోలీస్ బందోబస్తు మధ్య ఆర్టీసీ బస్సులను నడిపించి ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి డిపోల నుంచి 204 బస్సులు వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేశారు. వికారాబాద్ డిపోలో 82 బస్సులుండగా 63 నడువగా, ఇందులో ఆర్టీసీ 47, ప్రైవేటు 16, తాండూరు డిపోలో 93 బస్సులుండగా, 75 నడువగా, ఇందులో ఆర్టీసీ 53, 22 ప్రైవేటు.., పరిగి డిపోలో 87 బస్సులుండగా, 66 నడువగా ఇందులో ఆర్టీసీ 48, ప్రైవేటు 18 బస్సులను వివిధ ప్రాంతాలకు నడిపి ప్రయాణికులకు సౌకర్యం కల్పించారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...