కౌంటర్ దాఖలు చేయండి


Fri,November 15, 2019 11:26 PM

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని సంబంధిత ఎమ్మెల్యేలకు హైకోర్టు ఆదేశించింది. అయితే ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ చేసిన హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించడంతోపాటు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లాలో వికారాబాద్, కొడంగల్, పరిగి నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ స్వల్ప మెజార్టీతో గెలుపొందారని, ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే గెలిచారని కాంగ్రెస్ తరపున పోటీచేసిన ప్రసాద్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల నియమవళిని ఉల్లంఘించి అధిక డబ్బులు ఖర్చు చేశారని కాంగ్రెస్ తరపున పోటీచేసిన రేవంత్‌రెడ్డి.. నరేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంపై కోర్టుకెళ్లగా, పరిగి నియోజకవర్గంలో ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే పరిగి ఎమ్మెల్యేగా కొప్పుల మహేశ్‌రెడ్డి ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన రామ్మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...