పరుగులు పెడుతున్న ప్రగతి చక్రాలు


Thu,November 14, 2019 11:43 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : ఆర్టీసీ కార్మికుల సమ్మె 41వ రోజూ కొనసాగుతున్నప్పటికీ ప్ర యాణికులకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ప్రత్యామ్నాయ మార్గాల తో బస్సులను నడిపించి ప్రయాణికులకు సౌకర్యా లు కల్పించారు. గురువా రం డిపో నుంచి 82 బస్సులకు గాను 64 బస్సులు వివిధ రూట్లల్లో కొనసాగించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కార్మికులు స మ్మెను కొనసాగించారు. ఆర్టీసీ అధికారులు ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపించి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించారు. ఆర్టీసీ కార్మికులు చే పట్టిన సమ్మె ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. డిపోలో 24 ప్రైవేట్ బస్సు లు, 58 ఆర్టీసీ బస్సులు మొత్తం 82 బస్సులు ఉన్నాయి. అందులో 64 బస్సు లు నడుపగా, 45 ఆర్టీసీ, 19 ప్రైవేట్ బస్సులను వివిధ రూట్లల్లో ప్రయాణికుల సౌకర్యార్థం నడిపించారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...