ఉన్నతమైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాల


Thu,November 14, 2019 11:43 PM

విద్యార్థులు ఉన్నతమైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలని, అప్పుడే ఉన్నత లక్ష్యం అందుకోగలుతామని పలువురు పేర్కొన్నారు. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని గురువారం నియోజకవర్గ పరధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో బాలల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. బాలల దినోత్సవం గొప్పతనం గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించా లన్నారు. చదువులో రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తేవాలన్నారు. - జోన్ బృందం

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles