పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవాలి


Thu,November 14, 2019 11:43 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్ర ంగా ఉంచుకొని పట్టణాన్ని సుందరం గా తీర్చిదిద్దుకోవాలని మున్సిపల్ కమిషనర్ బోగేశ్వర్లు తెలిపారు. గురువా రం 30 రోజుల పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పరిధిలో ని 16వ వార్డు రామయ్యగూడలో ఇం టింటికీ తిరిగి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కా లనీల్లో మహిళలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. అదేవిధంగా కాలనీల్లో మురుగు నీటి కాల్వల్లో క్రిమి కీటకాలు నశింపజేసే మందుల పి చికారీ, పిచ్చి మొక్కల తొలగింపు, పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండి అన్ని విధాలుగా అభివృద్ధి సాధించి సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 30 రోజుల ప్రణాళికను ప్రవేశపెట్టడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములై పరిసరాలను పరిశుభ్రం గా ఉంచుకోవాలన్నారు. ప్లాస్టిక్‌ను వినియోగించకుండా ఉండాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల వాతావరణం కాలుష్యం ఏర్పడుతుందన్నారు. దీ నిద్వారా అనేక ప్రాణాంతకమైన వ్యాధులు సంబవించే అవకాశం ఉందన్నారు.

భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అం దించాలంటే ప్లాస్టిక్‌ను వినియోగించవద్దన్నారు. ప్రతి మహిళా ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వే రు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని ఆ యన సూచించారు. డ్వాక్రా సంఘాల మహిళలు కాలనీల్లో పరిసరాల పరిశుభ్రతపై, తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. అదేవిధంగా కాలనీల్లో హెల్త్ క్యాంప్‌లు నిర్వహించి ఉచితం గా వైద్య పరీక్షలు చేపట్టి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ము న్సిపల్ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...