మహిళలతోనే గ్రామాలు పరిశుభ్రం


Thu,November 14, 2019 11:43 PM

బంట్వారం : గ్రామంలో మహిళలతోనే పరిశుభ్రం నెలకొంటుందని కలేక్టర్ మస్రత్ ఖానమ్ ఆయోషా అన్నారు. గురువారం ఆమె మండల పరిధిలోని నాగ్వారం జీపీని సందర్శించారు. గ్రామంలోని మహిళలు, మహిళ సంఘా ల సభ్యులు, ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి చెత్త లేకుండ స్వచ్ఛందంగా ఉంచాల్సిన బాధ్యత గ్రామంలోని మహిళ సంఘాల సభ్యులదే అన్నారు. మహిళలు సాధించనిది ఏది లేదని, ప్రతి ఇంటిలో, ఇంటి పరిసరాల్లో చెత్త లేకుం డ చూడాలన్నారు. ఎవరి ఇంటి పరిసరాలను వారు శుభ్రం చేసుకుంటే గ్రామం మొత్తం పరిశుభ్రంగా ఉంటుందన్నారు.

గ్రామ పంచాయతీ సిబ్బంది చెత్త సేకరణకు వస్తే తడి, పొడి చెత్తను వేరుగా వేయించాలని చెప్పారు. తడి పొడి చెత్తను వేరు చేసి, డీఆర్‌సీ సెంటర్‌కు తీసుకెళ్లాలని సూచించారు. కొందరు మహిళలు గ్రామంలో మురుగు కాలువల నిర్మాణం చేయాలని చెప్పగా, మురుగ కాలువలకన్న ముఖ్యం గ ఇంకుడు గుంతలను తవ్వుకోవాలని కలెక్టర్ సూచించారు. అయితే గ్రామం అంత నల్ల రేగడి మట్టి ఉందని, ఇంకుడు గుంతలు తవ్వడంతో నీరు నిల్చిపోయి మట్టింత దిగబడి ఇండ్లు కూలే ప్రమాదం ఉంటుందని గ్రామస్తులు ఆమె దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో పీడీ జాన్స్, ఏపీఎం రాజు, ఏపీవో సుధాకర్, పంచాయతీ కార్యదర్శి మహేందర్, మహిళ సమైఖ్య అధ్యక్షురాలు అమృతమ్మ, ఇతర సంఘం సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...