జాతరకు పోటెత్తిన భక్తజనం


Thu,November 14, 2019 11:42 PM

ధారూరు : ధారూరు మెథడిస్టు జాతరకు ఆయా ప్రాంతాల నుంచి యాత్రికులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. జాతర ప్రారంభమై మూడు రోజులు కావడంతో యాత్రికుల సంఖ్య భారీగా పెరుగుతుంది. జాతరకు వచ్చిన యాత్రికులు ఇప్పచెట్టుకు, సిలువ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ఏసుప్రభును కొలిచారు. మెథడిస్టు జాతరకు యాత్రికులు ప్రైవేటు వాహనాల్లో, ద్విచక్ర వాహనాలపై, రైళ్లలో అధిక సంఖ్యలో జాతరకు తరలివచ్చారు. దక్షణ మధ్య రైల్వే అధికారులు మెథడి స్టు జాతర సందర్భంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశా రు. జాతరకు వచ్చిన యాత్రికులకు క్రైస్తవ మత పెద్దలు ఏసుప్రభు మహిమలు, ఆయన గొప్పతనాన్ని వివరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రా ద్వారా ఏసు ప్రభు పాటలను పాడి వినిపించారు.

భక్తులు రాత్రి సమయంలో ఏసు ప్రభు సన్నిధిలో నిద్రచేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్మకం. జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. జాతర ప్రాంగణంలో మట్టికుండలో వంటకాలు చేసుకోవడం ప్రత్యేకంగా నిలుస్తుంది. జాతరలో యాత్రికుల కోసం వైద్యాధికారులు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసు సీసీ కెమెరాలను అమర్చి పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles