నిరంతర సాధనతోనే విజయం


Thu,November 14, 2019 11:42 PM

-వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్
వికారాబాద్, నమస్తే తెలంగాణ : నిరంతరం సాధన చేస్తేనే విజయాన్ని సొంత చేసుకుంటారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంథాలయంలో 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగితే ఎంతో మేధోసంపత్తి పెరుగుతుందని అన్నారు. గ్రంథాలయాలు విజ్ఞానాన్ని పెంపొందించే సరస్వతీ నిలయాలని తెలిపారు. జీవిత లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం కృషి చేస్తే అలవోకగా లక్ష్యాలను చేరుకుంటారని అన్నారు. నేటి బాలలే రేపటి బావిభారత పౌరులని తెలిపారు. చిన్న తనంలోనే గ్రంథాలయాలకు వెళ్లి మంచి పుస్తకాలు చదువడం అలవర్చుకోవాలని సూచించారు. వికారాబాద్ పట్టణంలో ప్రభుత్వ స్టడీ సెంటర్, డిగ్రీ కళాశాల మంజూరుకు కృషి చేస్తానని అన్నారు. విద్యాభివృద్ధితోనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

ఉన్నత చదువులతోనే గౌరవం లభిస్తుందని అన్నారు. యుక్త వయస్సులో మంచి అలవాట్లు నేర్చుకుంటేనే బంగారు భవిష్యత్ ఉంటుందని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్‌రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలు సరస్వతీ నిలయాలని విజ్ఞానాన్ని పెంపొందించేందుకు గ్రంథాలయాలు ఎంతో ఉపకరిస్తాయని తెలిపారు. జిల్లా గ్రంథాలయంలో పాఠకులకు అన్ని వసతులు కల్పించడంతోపాటు సరైన విధంగా అభివృద్ధి చేశామని తెలిపారు. గ్రంథాలయం ఎదుట ఉన్న స్వామి వివేకానంద పార్కును అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్ విజయ్‌కుమార్, మర్పల్లి జడ్పీటీసీ మధుకర్, ప్రభాకర్‌గుప్తా, మాజీ జడ్పీటీసీ ముత్తహర్ షరీఫ్, శుభప్రద్‌పటేల్, టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, తిమ్మని శంకర్, వేణుగోపాల్‌రెడ్డి, షఫీ, చిగుళ్లపల్లి రమేష్‌కుమార్ పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles