నిలిచిపోయిన పనులను ప్రారంభించండి


Wed,November 13, 2019 10:46 PM

తాండూరు రూరల్ : మండలంలో పంచాయతీ భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలాయి. 2015లో మంజూరైన పంచాయతీ భవన నిర్మాణాల పనులు ముందుకు సాగడంలేదు. మండల పరిధిలోని చెన్‌గేష్‌పూర్, కరణ్‌కోట, గౌతాపూర్, చంద్రవంచ, బెల్కటూర్, వీరారెడ్డిపల్లి గ్రా మాలకు ఉపాధి హామీ పథకం కింద భవన నిర్మాణాలకు రూ.12 లక్షల చొప్పున మం జూరు చేశారు. అయితే చెన్‌గేష్‌పూర్, కరణ్‌కోట, వీరారెడ్డిపల్లి, బెల్కటూర్ గ్రామాల్లో భవనాల పనులు అసంపూర్తిగా మిగిలియాయి. గౌతాపూర్‌కు మంజూరైన భవన నిర్మాణ పనులు ఇంకా ప్రారంభించలేదు.

పురాతన భవనం శ్లాబ్ పెచ్చులుడుతున్నాయి. పంచాయతీ భవనం కూలీపోయేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుత పాలకవర్గం ఆ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నది. చంద్రవంచలో స్థలం లేదనే కారణంగా ఇప్పటి వరకు భవన పనులు ప్రారంభించలేదు. పంచాయతీ రాజ్ అధికారులు జీపీ భవన నిర్మాణాలపై దృ ష్టి సారించాలని సర్పంచ్‌లు పేర్కొంటున్నారు. నిలిచిపోయి న పనులను ప్రారంభించాలని సర్పంచ్ కోరారు. అధికారు లు స్పందించి నిర్మించిన వాటికి బిల్లులు ఇప్పించాలని, నిలిపోయిన భవనాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాల ని ఆయా గ్రామాల సర్పంచ్‌లు కోరుతున్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles