బ్లాక్ క్వార్టర్స్ పరిశీలన


Wed,November 13, 2019 10:46 PM

వికారాబాద్ రూరల్ : పట్టణంలోని బ్లాక్ క్వార్టర్స్‌ను బుధవారం ఎంపీపీ చంద్రకళ పరిశీలించారు. బ్లాక్ వ్యవస్థ ఉన్నప్పుడు ఇక్కడ అధికారులు, సిబ్బంది కోసం గతంలో 8 క్వార్టర్స్‌ను నిర్మించడం జరిగింది. కాగా ప్రస్తుతం శిథిలావస్థకు చేరడాన్ని పరిశీలించారు. ఇందులో ఎన్ని క్వార్టర్స్ బాగున్నాయో, ఎన్ని శిథిలావస్థకు చేరాయో ఇంజినీర్లతో పరిశీలన చేయాలని ఎంపీపీ చంద్రకళ ఎంపీడీవో సుభాషిణిని ఆదేశించారు. క్వార్టర్స్‌లో ఎవరూ నివాసం లేకున్నా విద్యుత్ బిల్లులు రెగ్యులర్‌గా రావడంతో మం డలం నుంచి చెల్లించాల్సి వస్తుందని, దీంతో భారంగా మారుతుందన్నారు. ఈ విషయాన్ని విద్యుత్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ చెన్నారెడ్డి ఉన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles