నేటి నుంచి చైల్డ్‌లైన్ వారోత్సవాలు


Wed,November 13, 2019 10:46 PM

తాండూరు రూరల్ : ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు చైల్డ్‌లైన్ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తాండూరు చైల్డ్‌లైన్ కో ఆర్డినేటర్ వెంకటేశ్ తెలిపారు. బుధవారం చైల్డ్‌లైన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018-19లో చైల్డ్‌లైన్‌కు మొత్తం 433 ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రధానంగా తప్పిపోయి, దొరికిన పిల్లలు, వేధింపులకు గురైన బాలలు, పాఠశాలల్లో దండనకు గురైన బాలలు, బిక్షటన చేస్తున్న బాలలు, బాల్యవివాహాలపై కూడా చైల్డ్‌లైన్‌కు ఫిర్యాదులు వచ్చాయన్నారు. అదేవిధంగా పిల్లల అక్రమ దత్తత, అంగన్‌వాడీ కేంద్రాలపై కూడా ఫిర్యాదులు వచ్చాయన్నారు. వీటితో పాటు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఇతర ఫిర్యాదులు కూడా వచ్చాయన్నారు. ఈ నెల 14న తాండూరులో చైల్డ్‌లోన్ దోస్త్ ఫోస్టర్ విడుదల, సంతకాల సేకరణ చేయనున్నామన్నారు.

15న తాండూరు టౌన్, యాలాల మండల కేంద్రంలో స్వచ్ఛ పాఠశాలలు, బాలల హక్కులపై అవగాహన, 16న తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ వినియోగం బాలల హక్కుల ఉల్లంఘనపై అవగాహన, 17న తాండూరు రైల్వే స్టేషన్, బస్టాండ్, లేబర్ అడ్డాలో చైల్డ్‌లైన్ సేవలు, మత్తు పదార్థాల వినియోగం బాలలపై ప్రభావం అవగాహన, 18న సాయిపూర్‌లో ప్రత్యేక అవసరాల పిల్లలచే ఆట పోటీలు, బిక్షటనే చేస్తున్న పిల్లల తల్లిదండ్రులకు అవగాహన, 19న కొడంగల్‌లో బాలలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ర్యాలీ, 20న పెద్దేముల్ మండల కేంద్రంలో బాల్యవివాహాల నిర్మూలన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో చైల్డ్‌లైన్ సభ్యులు వెంకటేశ్, హన్మంత్‌రెడ్డి, జ్యోతి, నర్సింహులుగౌడ్ పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles