ఆటంకం లేని ఆర్టీసీ ప్రయాణం


Mon,October 21, 2019 11:42 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సోమవారం 17వ రోజు కార్మికులు సమ్మెను కొనసాగించారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాత్కాలిక ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపించి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు.

వికారాబాద్ డిపోలో 82 బస్సులు ఉండగా వివిధ ప్రాంతాలకు 63 బస్సులు ప్రయాణికులను చేరవేసేందుకు బస్సులను నడిపించారు. దీంతో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రభా వం ఏ మాత్రం కనిపించలేదు. యథావిధిగా సమయానికి బస్సులు రావడంతో ప్రయాణికులు సురక్షితంగా వారు వెళ్లే ప్రాంతాలకు పయణమై వెళ్లారు. 63 బస్సులను వివిధ రూట్లల్లో హైదరాబాద్, శంకర్‌పల్లి, సదాశివాపేట, పరిగి, పట్టణాలకు ప్రయాణికుల సౌకర్యార్థం నడిపించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ బలగాలను మోహరించి పరిస్థితులను పర్యవేక్షిస్తూ పటిష్ట చర్యలు తీసుకున్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles