ఘనంగా తిరుమలనాథస్వామి రథోత్సవం


Sun,October 20, 2019 11:46 PM

పూడూరు : పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామంలోని తిరుమలనాథస్వామి దేవాలయ ఉత్సవాల (జాతర) సందర్భంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా రథోత్సవం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం గ్రామంలోని రామాలయం, శివాలయం, హనుమాన్ మందిరాల వద్ద తిరుమలనాథస్వామి రథోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు పీఠాధిపతి వెంకటదాసులు చేశారు. అర్ధరాత్రి అనంతరం శ్రీవారిపూల వసంతోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. 21వ తేదీన రాత్రి 11గంటలకు స్వామివారి ఏకాంతసేవ మానస పూజ కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నాయి.

నాలుగు రోజుల పాటు దేవాలయంలో వివిధ ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలతో పాటు సంకీర్తనలు, భజనలతో తిరుమలనాథస్వామి నామస్వరణతో గ్రామం లో మారుమోగుతున్నాయి. వెంకటదాసుల వారు పలు ప్రవాచనాలను భక్తులకు వినిపించారు. ఉత్సవాల సందర్భంగా దేవాలయం వద్ద దాతల సహయంతో నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వాహకులు చేపడుతున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీధర్‌గుప్తా, ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి, ప్రజాప్రతినిధులు, అర్చకులు, భజన భక్తులు, యువజన సంఘ నాయకులు ఉన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...