శభాష్.. రాజేశ్


Sun,October 20, 2019 11:46 PM

వికారాబాద్ రూరల్: వికారాబాద్ పట్టణంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో ఏటీఎం కార్డు ఉపయోగించి ఎవరో ఓ వ్యక్తి ఉదయం 10 గంటల సమయంలో రూ.9వేల నగదును డ్రా చేశారు. ఏటీఎం నిదానంగా పని చేయాడంతో డబ్బులు రావడం లేదని ఆ వ్యక్తి వెనుదిరిగిపోయాడు. కానీ కొంత సమయానికి రూ.9వేలు డ్రా అయ్యి ఏటీఎం మిషన్ దగ్గర అలాగే ఉండిపోయాయి. అదే సమయంలో పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన రాజేశ్ ఏటీఎం వద్దకు డబ్బులు డ్రా చేసుకునేందుకు రాగా అక్కడ ఏటీఎం వద్ద ఉన్న డబ్బులు అతనికి కనిపించాయి. అతను వెంటనే వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న సీఐ శ్రీనివాస్‌రావు, ఎస్‌ఐ లక్ష్మయ్యలకు అందించి నిజాయతీ చాటుకున్నాడు. వేరే వారి సొమ్ము అని గ్రహించి పోలీస్ స్టేషన్‌కు తెచ్చి ఇచ్చిన రాజేశ్‌ను శబాష్ అని పలువురు మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ సీఐ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిజాయతీగా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా యువకులు మంచి పనులు చేసేందుకు ముందుకు రావాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ రాజేశ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...