పంటల సాగులో మెళకువలు పాటించాలి


Sat,October 19, 2019 11:16 PM

వికారాబాద్ రూరల్ : కూరగాయల పంటలు పండించడానికి వికారాబాద్ జిల్లా అనువైనదని, రైతులు చిన్న పాటి మెళకువలు పాటించి కూరగాయల సాగుతో అధిక లాభాలు పొందాలని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి మలినిరెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ మండల పరిధిలోని నారాయణపూర్‌లో రైతులు సాగు చేసిన పాలిహౌజ్‌లోని బంతిపూల సాగును, కూరగాయల పందిరిలో గల కాకరకాయ పంటలను, ఉద్యానవన పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా రాష్ట్ర రాజధానికి దగ్గరలో ఉండటంలో రైతులు క్షేత్ర స్థాయిలో పండించిన పంటలను హైదరాబాద్ మార్కెట్‌కు తరలించవచ్చన్నారు. పొలాల్లో మెళకువలు అనుసరించి ఆధునిక పద్ధతులైన డ్రిప్స్, మల్చింగ్‌విధానంతో, అధికారుల సలహాలు, సూచనలు పాటించి సేద్యం చేస్తే లాభాలు భారీగా వస్తాయన్నారు. రైతులు మార్కెట్ సౌలభ్యం చూసుకొని ఆయా సీజన్‌లో ఏ పంట సాగు దిగుబడి అధికంగాఉంటుందో వాటిలో మేలు రకాలు ఎంచుకొని సాగు చేయాలన్నారు. నారాయణపూర్‌లో గత సంవత్సరం సుభాన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డిలు ఉద్యానవన శాఖ ద్వారా రాయితీపై లబ్ధిపొందినా రెండు ఎకరాల పాలిహౌజ్‌లో సాగు చేస్తున్న క్యాప్సికం, కూరగాయల పందిరిపై సొరకాయ పంట సాగు ద్వారా నాణ్యమైన పంటను పండించారన్నారు. సాధారణ మార్కెట్‌లో కంటే అధిక రేట్లు కార్పొరేట్ కంపెనీ అయినా రిలియన్స్ వారు నేరుగా వచ్చి రైతు నుంచి రూ.40ల చొప్పున కొనుగోలు చేశారని స్పష్టం చేశారు. వేసవిలో కొత్తిమీర సాగు చేయడంతో బాగా లాభాలు రావడంతో, గత సంవత్సరం రూ.4లక్షల ఆదాయం పొందారన్నారు. ఈ ఖరీఫ్‌లో పాలిహౌస్‌లో ఎకరం సాగులో ఈస్ట్‌వెస్ట్ కంపెనీవారి ఎల్లో వెరైటీ, దసరా పండుగ సందర్భంలో దేవినవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ పండుగలు ఉండటంతో బందిపూల ధర రూ.80చొప్పున పలికిందన్నారు. పందిరి విధానంతో పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ రాయితీలను చిన్న, పెద్ద సన్నకారు రైతులందరికి 50 శాతం రాయితీపై కూరగాయల పందిర్లు, మల్చింగ్ పేపర్ అందిస్తామన్నారు. కార్యక్రమంలో మండల ఉద్యానవన అధికారి వైజయంతి, ఉద్యాన విస్తీర్ణ అధికారి నర్సింహారెడ్డి ఉన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...