జోరుగా ఇంకుడు గుంతల నిర్మాణాలు


Sat,October 19, 2019 11:16 PM

కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని వివిధ గ్రామా ల్లో ఇంకుడు గుంతల నిర్మాణం కొనసాగుతుంది. మండల పరిధిలోని ప్రతి గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణంతో ఇంకుడు గుంతల నిర్మాణాలు కూడా యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారిచేయడంతో గ్రామాల్లో అధికారులు ఇంకుడు గుంతలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. శనివారం కులకచర్ల మండల పరిధిలోని ముజాహిద్‌పూర్ గ్రామంలో నిర్మిస్తున్న ఇంకుడు గుంతల నిర్మాణానికి గ్రామసర్పంచ్ లక్ష్మి ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

పూడూరులో..
పూడూరు: ప్రతి ఒక్కరు నీరు రోడ్లపై వదలకుండా ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ఎంపీపీ పుడుగుర్తి మల్లేశం పేర్కొన్నారు. పూ డూరు మండలంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంకుడుగుంతలు ఏర్పాటు వల్ల స్థానికంగానే నీరు భూమిలోకి ఇంకి భూగర్భజలాలు పెరుగుతాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.12500లు ఇవ్వగా, ఇంకుడు గుంతలకు రూ. 4500లు ఇస్తుందన్నారు. గ్రామ పంచాయతీలల్లో పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉంటారని తెలిపారు. గత 30రోజుల ప్రణాళిక ద్వా రా గ్రామాలు పరిశుభ్రంగా మారయని తెలిపారు. హరితహారం ద్వారా నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వస్తువులు తీసుకువచ్చేందుకు ప్లాస్టిక్ వాడకాలను నిషేదించి దారం బస్తాలను వాడాలన్నారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికి అందేలా అధికారులు చూడాలన్నారు.

దోమలో..
దోమ : ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలను నిర్మించుకుని వృథా నీటిని వినియోగించుకోవాలని మండల పరిషత్ అధ్యక్షురాలు అనసూయ తెలిపారు. ఇంకుడు గుంతల నిర్మాణ పనుల్లో భాగంగా మండల పరిధిలో ని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భూగర్భ జలాల పెంపుకోసం ఎక్కడి నీటిని అక్కడే ఓడిసి పట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపట్టినందున ప్రతి కుటుం బం ఇంటి ఆవరణల్లో ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలన్నారు. ప్రభుత్వ నిధులను వినియోగించుకుని భూగర్భ జలాల పెంపు కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...