కొనసాగిన ఆర్టీసీ ప్రయాణం


Fri,October 18, 2019 10:48 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ: ఆర్టీసీ కార్మికులు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఆర్టీసీ ఉద్యోగులు 14వ రోజు విధులకు హాజరు కాకుండా సమ్మెను యథావిధిగా చేపట్టారు. జిల్లాలోని పరిగి, వికారాబాద్, తాండూరు బస్ డిపోల నుంచి తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వివిధ ప్రాంతాలకు బస్సులు పోలీస్ బందోబస్తు మధ్య నడిచాయి. జిల్లాలోని 3 బస్‌డిపోల నుంచి హైదరాబాద్, మోహిదిపట్నంతో పాటు మహబూబ్‌నగర్, సదాశివపేట, శంకర్‌పల్లి, వికారాబాద్, తాండూరు, పరిగి ప్రాంతాలకు పోలీస్ బందోబస్తు మధ్య ఆర్టీసీ బస్సులను నడిపించి ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి డిపోల నుంచి 158 బస్సులు వివిధ ప్రదేశాలకు ప్రయాణికులను చేరవేశారు. వికారాబాద్ డిపోలో 82 బస్సులు ఉండగా, 60 బస్సులు, ఇందులో ఆర్టీసీ 43, ప్రైవేటు 17 బస్సులు వివిధ ప్రాంతాలకు తరిలివెళ్లాయి. తాండూరు డిపోలో 93 బస్సులుండగా, 68 బస్సులు, ఇందులో ఆర్టీసీ 45 బస్సులు, ప్రైవేటు బస్సులు 23 బస్సులు వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తరలించారు. పరిగి డిపోలో 87 బస్సులుండగా 30 బస్సులు ఇందులో ఆర్టీసీ 30 బస్సులు వివిధ ప్రాంతాలకు నడిపి ప్రయాణికులకు సౌకర్యం కల్పించారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...