గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి


Thu,October 17, 2019 10:54 PM

పూడూరు : గ్రామ పంచాయతీలను పరిశుభ్రవగా ఉంచుకుని స్వచ్ఛగ్రామాలుగా ఎంపికకు సర్పంచ్‌లు కృషి చేయాలని జడ్పీటీసీ మేఘమాల, ఎంపీపీ మల్లేశంలు తెలిపారు. గురువారం పూడూరు మండల కేంద్రంలో 30రోజుల ప్రణాళిక పనులు, ఇంకుడుగుంతలపై అధికారులు, సర్పం చ్‌లు, ఎంపీటీసీలతో ప్రత్యేక సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం గ్రామ పంచాయతీలకు ఇచ్చిన ప్రణాళిక ద్వారా చాలా గ్రామాలు పారిశుద్ధ్యం పను లు జరిగాయని తెలిపారు. ప్రతి ఒక్క రూ తమ ఇంటి వద్ద మురుగు నీరు రోడ్లపై పార కుండా ఇంకుడు గుంతలు తొవ్వుకోవాలని సూచించారు. ఇంకుడు గుంతలు తొవ్వుకు న్న అభ్యర్థులకు ప్రభు త్వం రూ. 4500 లు అందజేస్తేందన్నారు.

ప్రతినెల ఒక్క రోజు గ్రామంలో స్వచ్ఛందంగా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం స్థాని ప్రజాప్రతినిధులు, అధికారులు, యువజన సంఘాల సభ్యులు, గ్రామ పంచాయతీ కమిటీ సభ్యులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. గ్రామ పంచాయతీల్లో దాతల సహయంతో చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవాలని వారు పేర్కొన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ముందుండి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, ఎంపీడీవో ఉషా, ఈవోఆర్‌డి పరంకుషరావు, ఏపీవో రాములు, సర్పంచ్‌లు శ్రీధర్‌గుప్తా, అనంత్‌రెడ్డి, ఆంజనేయులు, మల్లిక, జయమ్మ, యాదమ్మ, రాములు, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీలు సురేందర్, నాగమణి ఉన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...