నవంబర్ 4న జిల్లాకు గవర్నర్ రాక


Thu,October 17, 2019 10:53 PM

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వచ్చేనెల 4వ తేదీన రాష్ట్ర గవర్నర్ తమిళిసైసౌందరరాజన్ జిల్లాకు రానున్నారు. వికారాబాద్ పట్టణంలోని శ్రీఅనంత పద్మనాభ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో గవర్నర్ పాల్గొననున్నారు. శ్రీఅనంత పద్మనాభ కాలేజీ ఏర్పాటై 50 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించేందుకు నిర్ణయించిన కాలేజీ యాజమాన్యం ఈమేరకు రాష్ట్ర గవర్నర్‌కు ఆహ్వానం పలికారు. అదేవిధంగా ఎస్‌ఏపీ కాలేజీ ఉత్సవాల్లో పాల్గొనడంతోపాటు అనంతగిరిలోని శ్రీఅనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకోనున్నట్లు తెలిసింది. అంతేకాకుండా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మహావీర్ ఆసుపత్రి యాజమాన్యం కూడా తమ ఆసుపత్రిని సందర్శించేందుకు ఆహ్వానించగా, అదేరోజు మహావీర్ ఆసుపత్రిని కూడా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సందర్శించే అవకాశముంది.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...