100శాతం బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలి


Thu,October 17, 2019 10:53 PM

పరిగి/వికారాబాద్, నమస్తే తెలంగాణ: ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం 13వ రోజుకు చేరుకుంది.గురువారం ఉదయం కలెక్టర్ మస్రత్‌ఖానమ్‌ఆయేషా వికారాబాద్, పరిగి డిపోలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 100 శాతం బస్సులను నడిపేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి బస్సులో టిమ్ మిషన్ లేదా టికెట్‌లు లేకుండా నడిపించరాదని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని పరిగి, వికారాబాద్, తాండూరు బస్ డిపోల నుంచి తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వివిధ ప్రాంతాలకు బస్సులు పోలీస్ బందోబస్తు మధ్య నడిచాయి.

జిల్లాలోని 3 బస్‌డిపోల నుంచి హైదరాబాద్, మోహిదీపట్నంతో పాటు మహబూబ్‌నగర్, సదాశివపేట, శంకర్‌పల్లి, వికారాబాద్, తాండూరు, పరిగి ప్రాంతాలకు పోలీస్ బందోబస్తు మధ్య ఆర్టీసీ బస్సులను నడిపించి ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించారు. జిల్లాలోని వికారాబాద్, తాం డూరు, పరిగి డిపోల నుంచి 186 బస్సులు వివిధ ప్రదేశా లకు ప్రయాణికులను చేరవేశారు. వికారాబాద్ డిపోలో 82 బస్సు లు ఉండగా, 58 బస్సులు, ఇందులో ఆర్టీసీ 38, ప్రైవేటు 20 బస్సులు వివిధ ప్రాంతాలకు తరలివెళ్లాయి. తాండూరు డిపో లో 93 బస్సులుండగా, 65 బస్సులు, ఇందులో ఆర్టీసీ 42 బస్సులు, ప్రైవేటు బస్సులు 23 బస్సులు, ఒకటి స్కూల్ బస్సు వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తరలించారు. పరిగి డిపోలో 87 బస్సులుండగా 63 బస్సులు ఇందులో ఆర్టీసీ 43, ప్రైవేటు 20 బస్సులు వివిధ ప్రాంతాలకు నడిపి ప్రయాణికులకు సౌకర్యం కల్పించారు.

పరిగి ఆర్టీసీ బస్టాండ్, డిపోను సందర్శించిన ఎస్పీ
పరిగిలోని ఆర్టీసీ బస్టాండ్, డిపోలను గురువారం ఎస్పీ నారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా బస్టాండ్‌తోపాటు, డిపో చుట్టుపక్కల ప్రాంతాలలో బందోబస్తు కోసం తీసుకోవాల్సిన చర్యలను ఎస్పీ సూచించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా, బస్సులు సజావుగా నడిచేలా చూడాలని ఎస్పీ పేర్కొన్నారు. పటిష్ట బందోబస్తు కోసం వెంటనే చర్యలు చేపట్టాలని పరిగి డీఎస్పీ రవీంద్రారెడ్డిని జిల్లా ఎస్పీ ఆదేశించారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...