46దుకాణాలు.. 683 దరఖాస్తులు


Wed,October 16, 2019 11:46 PM

-అత్యధికంగా ధారూర్‌లో ఒకే మద్యం దుకాణానికి 42దరఖాస్తులు
-కొడంగల్‌లోని ఆసక్తి చూపని వ్యాపారులు
-రేపు డ్రా ద్వారా మద్యం షాపులు కేటాయింపు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలోని మద్యం దుకాణాల టెండర్ దక్కించుకునేందుకు మద్యం వ్యాపారులు అధిక సంఖ్యలో పోటీపడ్డారు. జిల్లాలోని ఒకట్రెండు మద్యం దుకాణాలు మినహా మిగ తా అన్ని మద్యం షాపులకు పోటాపోటీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే తొలుత నాలుగు రోజులు పెద్దగా దరఖాస్తులు రాకపోయినప్పటికీ చివరి మూడు రోజులు అధిక మొత్తంలో దరఖాస్తు వచ్చాయి. బుధవారంతో మద్యం దుకాణాల టెండర్‌ను దక్కించుకునేందుకు దరఖాస్తుకు ఆఖరు రోజు కావడంతో మద్యం వ్యాపారులు ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం వ్యాపారులు అధి క సంఖ్యలో తరలివచ్చి జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారుల అంచనాలకు మించి దరఖాస్తులు రావడం గమనార్హం. అయితే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 9న ప్రారంభం కాగా నిన్నటితో ముగిసింది. అయితే మద్యం షాపులను ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కించుకునేందుకు మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి దరఖాస్తులు చేసుకున్నారు.

మరోవైపు మద్యం టెండర్లను దక్కించుకునేందుకు మహిళలు కూడా అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా ధారూర్ మండల పరిధిలోని మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు తీవ్ర పోటీ ఉండగా, కొడంగల్ పరిధిలో మాత్రం మద్యం వ్యాపారులు అంత గా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. అయితే ఒక్కొ దరఖాస్తుకు రూ. 2లక్షల చొప్పున నాన్-రిఫెండబుల్ ఫీజు ను డీడీ రూపంలో వ్యాపారులు చెల్లించగా, జిల్లాలోని 46మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తులతో జిల్లా ఎక్సైజ్ శాఖకు రూ.13.62కోట్ల ఆదాయం వచ్చింది. అయితే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను జిల్లా ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ సూపరింటెండెంట్ వరప్రసాద్ పర్యవేక్షించారు.

ఆఖరి రోజు కిక్కిరిసిన అంబేద్కర్ భవన్...
మద్యం దుకాణాలకు దక్కించుకునేందుకు దరఖాస్తుకు బుధవారం ఆఖరు రోజు కావడంతో ఉదయం నుంచి పొద్దుపోయే వరకు ఉన్నారు. జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారుల అంచనా ప్రకారం బుధవారం భారీగా దరఖాస్తు లు రావడం గమనార్హం. ఉద యం 10గంటల నుంచి రాత్రి 7గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్ర మం కొనసాగింది. అధిక మొ త్తంలో దరఖాస్తుదారు లు రావడంతో నిర్ణీత సమయానికి వచ్చి న వారందరి దరఖాస్తులను స్వీ కరించారు. గతేడాది 45 మద్యం దుకాణాలకు 431దరఖాస్తులురాగా, ఈ ఏడాది 46మద్యం దుకాణాలకు గతేడాదికి మించి దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 46మద్యం దుకాణాలకు 683మంది వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. తాండూర్, వికారాబాద్ డివిజన్‌లో అత్యధికంగా దరఖాస్తులురాగా, కొడంగల్ డివిజన్‌లో అత్యల్పంగా దరఖాస్తులు వచ్చా యి. చివరి రోజు మాత్రం వికారాబాద్ డివిజన్ పరిధిలోని మద్యం దుకాణాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 683దరఖాస్తులురాగా, తాండూర్ డివిజన్లోని 16మద్యం దుకాణాలకు 206 దరఖాస్తులు, వికారాబాద్ డివిజన్‌లోని 11మద్యం దుకాణాలకు 202దరఖాస్తులు, మోమిన్‌పేట్ డివిజన్‌లోని 5మద్యం దుకాణాలకు 71దరఖాస్తులు, పరిగి డివిజన్‌లోని 9మద్యం దుకాణాలకు 140దరఖాస్తులు, కొడంగల్ డివిజన్‌లోని 5 మద్యం దుకాణాలకు 64దరఖాస్తులు అందాయి. అయితే సోమ, మంగళ, బుధవారాల్లో వరుసగా భారీగా దరఖాస్తు చేసుకున్నారు.

సోమవారం ఒక్కరోజే 181 దరఖాస్తులురాగా, మంగళవారం 106దరఖాస్తులురాగా, బుధవారం 396దరఖాస్తులు వచ్చాయి. బుధవారం ఒక్కరోజు తాండూర్ డివిజన్‌లో 103దరఖాస్తులు, వికారాబాద్ డివిజన్‌లో 126దరఖాస్తులు, మోమిన్‌పేట్ డివిజన్‌లో 47దరఖాస్తులు, పరిగి డివిజన్‌లో 88దరఖాస్తులు, కొడంగల్ డివిజన్‌లో 32 దరఖాస్తులు వచ్చాయి. అయితే వికారాబాద్ డివిజన్ పరిధిలోని ధారూర్‌లోని ఓ మద్యం దుకాణానికి అత్యధికంగా 42దరఖాస్తులు వచ్చాయి. అదే విధంగా అత్యల్పంగా కొడంగల్ డివిజన్ పరిధిలోని మూడు మద్యం దుకాణాలకు ఐదేసి చొప్పున దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు పరిగి పరిధిలోని ఓ మద్యం దుకాణానికి 31 దరఖాస్తులురాగా అత్యల్పంగా ఓ మద్యం దుకాణానికి 8దరఖాస్తులు, కొడంగల్ డివిజన్‌లో అత్యధికంగా 27 దరఖాస్తులురాగా అత్యల్పంగా 4 దరఖాస్తులు, వికారాబాద్ డివిజన్‌లో ఓ మద్యం దుకాణానికి అత్యధికంగా 42దరఖాస్తులురాగా అత్యల్పంగా 13దరఖాస్తులు వచ్చాయి.

మోమిన్‌పేట్ డివిజన్ పరిధిలోని ఓ మద్యం దుకాణానికి అత్యధికంగా 19దరఖాస్తులు రాగా, అత్యల్పంగా 12దరఖాస్తులు వచ్చాయి. తాండూర్ డివిజన్లో అత్యధికంగా 19దరఖాస్తులు రాగా అత్యల్పంగా 12 దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు జిల్లాలో వచ్చిన 683 దరఖాస్తులతో ఎక్సైజ్ శాఖకు రూ.13.66కోట్ల ఆదా యం వచ్చి చేరింది. తాండూర్ డివిజన్ నుంచి రూ. 4. 12 కోట్లు, వికారాబాద్ డివిజన్ నుంచి రూ. 4.04 కోట్లు, మోమిన్‌పేట్ డివిజన్ నుంచి రూ. 1.42 కోట్లు, పరిగి డివిజన్ నుంచి రూ. 2.80కోట్లు, కొడంగల్ డివిజన్‌లో రూ. 1.28 కోట్లు ఆదాయం వచ్చింది.

రేపు డ్రా తీసి మద్యం దుకాణాల కేటాయింపు...
రేపు డ్రా తీసి మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో రేపు ఉదయం 11గంటలకు డ్రా కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆయా ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ల వారీగా ఒక్కొ మద్యం దుకాణానికి వచ్చిన దరఖాస్తులను బట్టి డ్రా తీసి ఎవరి దక్కనుందో వెల్లడించనున్నారు.
జిల్లాలోని 46మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తులను బట్టి డ్రా తీయనున్నారు. అయితే నూతన మద్యం విధానం ప్రకా రం నిర్ణయించిన లైసెన్సు ఫీజును ఏడాదికి మూడు విడుతల వారీగా మద్యం దుకాణాలను దక్కించుకున్న వ్యా పారులు ఎక్సైజ్ శాఖకు చెల్లించనున్నారు. అయితే జిల్లా లో 5వేల జనాభాలోపు ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజును లైసెన్స్ ఫీజును రూ. 50లక్షలకు, 5వేల నుంచి 50వేలలోపు జనాభా గల ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజును రూ. 55 లక్షలుగా, 50వేల నుంచి లక్ష జనాభాగల ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజును రూ. 60లక్షల లైసెన్సు ఫీజును ఎక్సైజ్ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...