యువత ఉన్నతస్థాయికి ఎదుగాలి


Wed,October 16, 2019 11:43 PM

-ఎమ్మెల్యే డా. మెతుకు ఆనంద్
వికారాబాద్, నమస్తే తెలంగాణ : యువత అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత స్థానాల్లో నిలువాలని వికారాబాద్ ఎమ్మెల్యే డా. మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శివారెడ్డిపేట మైనార్టీ గురుకుల పాఠశాలలో డీఆర్‌డీఏ ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్, మార్కెటింగ్‌పై శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వికారాబాద్ ఎమ్మెల్యే డా. మెతుకు ఆనంద్ మాట్లాడుతూ ఉద్యోగ అవకాశాలకు శిక్షణ పొందినటువంటి యువత శక్తి సామర్ధ్యాలను పెంపొందించుకుని ఉన్నత శిఖరాలకు ఎదిగి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదుగాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అవకాశాలు తక్కువగా ఉంటాయని, యువత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో రానించాలని సూచించారు.

లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడే తమ కృషి ఫలిస్తుందని తెలిపారు. డీఆర్‌డీవో జాన్సన్ మాట్లాడుతూ గ్రామీణ నిరుపేద యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనేక కార్యక్రమాలను శిక్షణలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 70మంది యువతులకు ఇంగ్లిశ్‌తో ప్రావీణ్యం సంపాదించేందుకు శిక్షణను ఇవ్వడంతో పాటు కమ్యూనికేషన్స్ స్కిల్స్‌ను పెంపొందించేందుకు మూడు నెలల శిక్షణను ఇవ్వడం జరిగిందని తెలిపారు. శిక్షణ పొందినటువంటి యువతకు ఇంటర్వ్యూలకు హాజరయ్యే విధానంపై కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్‌డీవో బాలాస్వామి, ఎంపీపీ చంద్రకళ, పింఛన్ ఏపీడీ లక్ష్మి, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, చిగుళ్లపల్లి రమేశ్‌కుమార్, మాజీ జడ్పీటీసీ ముత్తహర్‌షరీఫ్, చందర్‌నాయక్, శిక్షణ పొందిన యువతుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles