పారిశుద్ధ్య కార్మికుల మురిపెం


Wed,October 16, 2019 11:43 PM

కోట్‌పల్లి : గ్రామ పంచాయతీలో పని చేసే పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తమ వేతనాలను పెంచుతూ జీవోను విడుదల చేయడంపై హర్షం వ్య క్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలో పంచాయతీ కార్మికుల జిల్లా అధ్యక్షుడు పి. బాల్‌రాజ్ ఆధ్యక్షతన స్థానిక సర్పంచ్ నక్కల విజయలక్ష్మీతో కలిసి కార్మికులు, పంచాయతీ ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సదానందం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారు పంచాయతీ కార్మికులకు 8500రూపాయలు వేతనం పెంచుతూ 51వ జీవోతో ఉత్తర్వులను జారీ చేయడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికులకు జీవిత బీమా కింద 2లక్షల రూపాయలను కూడా ప్రకటించారని అన్నా రు. ఈ సందర్భంగా పంచాయతీ శాఖ మంత్రికి ఎర్రబల్లి దయాకర్‌రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు హాజరై హర్షం వ్యక్తం చేశారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...