సాఫీగా.. ప్రయాణం


Wed,October 16, 2019 11:43 PM

తాండూరు, నమస్తే తెలంగాణ: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారంతో 12వ రోజుకు చేరింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. తాత్కాలిక పద్ధతిన నియమించిన డ్రైవర్లు, కండక్టర్లతో తాండూరు డిపోకు చెందిన 74 బస్సుల రాక పోకలు ప్రశాంతంగా జరిగాయి. వీటితో పాటు ప్రైవేటు వాహనాలు కూడా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో కీలక పాత్ర వహిస్తున్నాయి. ఆర్డీవో వేణుమాధవరావు, రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ప్రశాంత ప్రయాణంకు తోడ్పాటునందిస్తున్నారు. మరో వైపు ఆర్టీసీ యూనియన్ ప్రతినిధులు, కార్మికులు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...