పట్టా, పాసు పుస్తకాల్లో దేవుడి పేరే ఉండాలి


Wed,October 16, 2019 11:35 PM

పట్టా, పసు పుస్తకాల్లో ఏ ఒక్క వ్యక్తి పేరు లేకుండా దేవాదాయకు చెందిన 18.33 ఎకరాల భూమిని శ్రీ మహాలింగేశ్వర దేవాలయం పేరు పైనే చేయాలని గ్రామ సర్పంచ్ బీపప్పతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు గరివప్ప, బస్వరాజ్, సుభాన్‌రెడ్డి, వీరప్ప, రాంరెడ్డి, వాసుదేవరావు, సుధాకర్‌రావు, అనంతయ్య, నర్సింహులు, నందు, వెంకటయ్యతో పాటు గ్రామ ప్రజలు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సంధ్యారాణికి వినతి పత్రం అందజేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమి ఆక్రమణకు గురికాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరారు. అమ్మకాలు జరిపిన శివుడి భూమిని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వ్యక్తుల పేరుపైకి కాకుండా నిలిపి వేయాలని కోరారు. స్పందించిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సంధ్యారాణి రిజిస్ట్రేషన్ కాకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...