మురిపిస్తున్న కంది


Wed,October 16, 2019 11:35 PM

-ఆనందంలో రైతులు
యాలాల: మండలంలో వానకాలంలో వేసిన కంది పంట రైతులను మురిపిస్తున్నది. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు కంది పంట ఏపుగా పెరిగి ప్రస్తుతం మువ్వు, పూత దశలో కళకళలాడుతున్నది. కంది పంట రైతులను ఆనందంలో ముంచెత్తుతున్నది. గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాలు మెట్ట పంటలకు ఎంతో మేలు చేసిందని రైతులు పేర్కొంటున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన కంది పంట రైతులకు మేలు జరుగబోతున్నది. ప్రభుత్వం కంది పంటకు మద్దతు ధర ఇవ్వబోతుండటంతో రైతులుకు భరోసా ఇచ్చినట్లయింది. అనావృష్టి వల్ల ఇతర పంటలు చేతికి అందకుండా పోయినప్పటికీ కంది పంటతో లోటును పూడ్చుకోవచ్చని రైతులు ఆశతో ఉన్నారు. కంది పంట రైతుల్లో ఆశను నింపింది. భరోసాను కల్పించింది. దీంతో రైతులు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. మండలంలో 5685 ఎకరాలలో కందిని రైతులు పండిస్తున్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...