అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు


Tue,October 15, 2019 11:42 PM

తాండూరు, నమస్తే తెలంగాణ: రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్న వ్యాపారులు నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడంతో పాటు ప్లాట్ల కొనుగోలుదారులను మోసం చేస్త్తూ అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణకుమారి హెచ్చరించారు. ఆదివారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన రియల్ మోసం కథనంకు స్పందించిన కలెక్టర్ ఆయేషా మంగళవారం జాయింట్ కలెక్టర్‌ను తాండూరులో జరుగుతున్న అక్రమ లే అవుట్లు, నిర్మాణాలపై పరిశీలనకు పంపించారు. ఆర్డీవో వేణుమాధవరావు, రెవెన్యూ సిబ్బందితో కలిసి జాయింట్ కలెక్టర్ అరుణకుమారి తాండూరు ప్రాంతం లో అనుమతి లేని వెంచర్లను, నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అరుణకుమా రి మాట్లాడుతూ అనుమతులు లేని ప్లాట్లు, లే అవుట్లు, నిర్మాణాలకు వెంటనే నోటీసులు జారీ చేసి పూర్తిగా కూల్చి వేస్తామన్నారు. నిబంధనల ప్రకారం వ్యవసాయ భూములను ముందుగా రెవెన్యూ శాఖలో దరఖాస్తు చేసుకొని భూమి విలువలో 10 శాతం పన్ను చెల్లించి వ్యవసాయేతర భూములుగా మార్చుకున్న తరువాతే లే అవుట్లు చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఎన్‌వోసీ, భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో పాటు లే అవుట్ ప్లానింగ్ పత్రాలను డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారులకు సమర్పించి నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి పన్నులు చెల్లించి డీటీసీపీ ఆమోదం పొందాలని సూచించారు. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ఉన్న ప్రదేశాల్లో కన్‌వర్సెన్ చార్జీలు, డెవలప్‌మెంటు చార్జీలు తప్పక కట్టాలన్నారు. ప్రతి వెంచర్ ఏర్పాటులో 10 శాతం ఖాళీ స్థలంకు, 35 శాతం స్థలాన్ని రోడ్లు వదలాలన్నారు. ఇలా నిబంధనల ప్రకారం కాకుండా అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటివారైన ఉపేక్షించకుండా చట్టపరమైన చర్య లు తీసుకుంటామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉ న్న ప్లాట్లను ఎవరు కొనుగోలు చేయరాదని సూచించా రు. అక్రమ లే అవుట్లలో ఇండ్ల నిర్మాణాలకు అనుమతి కూడా ఉండదని తేల్చి చెప్పారు. అక్రమ వెంచర్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యమని తేలిన వారిపై కూడా తగు చర్యలు తీసుకుంటామన్నారు. తాం డూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలు కూడా తమ దృష్టికి వచ్చాయని పూర్తి విచారణ చేపట్టి అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. తాండూరు ప్రాంతంలో జరుగుతున్న భూములు, ప్లాట్ల అక్రమాల నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు తెలిపారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...