విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలి


Tue,October 15, 2019 11:40 PM

పూడూరు : విద్యార్థు ఓ లక్ష్యంతో ముందుకు వెళ్తు చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలని ఎంపీపీ పుడుగుర్తి మల్లేశం పేర్కొన్నారు. మంగళవారం పూడూరు మండల కేంద్రంలో అండర్ 17, అండర్ 14 వికారాబాద్ జిల్లా జోనల్ స్థాయి బాల, బాలికల వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాలలు మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారన్నారు. అంతజాతీయ స్థాయిలో ఆడే క్రీడాకారులు కూడా గ్రామీణ ప్రాంతాల నుండి వెళ్లినవారేనన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రత్యేక గుర్తింపునిస్తుందన్నారు. ఉమ్మడి రంగారెడ్డిలో జరిగే పోటీల్లో మండలం పేరును మొదటి స్థానంలో ఉండేలా చూడాలన్నారు. జిల్లా జోనల్ స్థాయి క్రీడలు ఇక్కడ నిర్వహించిన పీఈటీలకు తమ వంతు సహయ సహకరాలు అందజేస్తామన్నారు. అండర్ 17 బాలుర విభాగంలో పరిగి జోనల్ బాలురు ప్రథమ స్థానంలో గెలుపొందగా, రెండో స్థానంలో వికారాబాద్ జోనల్ విద్యార్థులు గెలుపొందారు. అండర్ 17లోబాలికల విభాగంలో వికారాబాద్ జోనల్ విద్యార్థినీలు ప్రథమ స్థానంలో గెలుపొందగా, రెండోవ స్థానంలో తాండూరు జోనల్ బాలికలు గెలుపొందారు. అండర్ 14లో బాలుర విభాగం పరిగి జోనల్ బాలురు ప్రథమ స్థానం గెలుపొందగా, రెండో స్థానంలో వికారాబాద్ జోనల్ బాలురు గెలుపొందారు. అండర్ 14 బాలికల విభాగంలో ప్రథమ స్థానం పరిగి జోనల్ గెలుపొందగా, రెండో స్థానంలో పెద్దేముల్ మండల బాలికలు గెలుపొందారు. గెలుపొందిన క్రీడాకారులకు ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, సర్పంచ్ నవ్యరెడ్డి, ఎంపీటీసీ సల్మాబేగం, ఉప సర్పంచ్ టి.రాజేందర్ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీశైలం, వికారాబాద్ జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ ప్రతాప్‌రెడ్డి, పీఈటీ నర్సింహులు, శివయ్య, కృష్ణయ్య, ఉపాధ్యాయులు జాంగీర్, నాయకులు ప్రభాకర్‌గుప్తా, నర్సింహారెడ్డి, తాజొద్దీన్, జంగయ్య, సుదర్శన్, సుజాత పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...