రయ్..రయ్..


Tue,October 15, 2019 11:40 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : ఆర్టీసీ కార్మికులు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మెను చేపట్టడం జరిగింది. మంగళవారం ఆర్టీసీ ఉద్యోగులు 11వ రోజు విధులకు హాజరు కాకుండా సమ్మెను ఏదావిధిగా చేపట్టారు. జిల్లాలోని పరిగి, వికారాబాద్, తాండూరు బస్ డిపోల నుంచి తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వివిధ ప్రాంతాలకు బస్సులు పోలీస్ బందోబస్తు మధ్య నడిచాయి. జిల్లాలోని 3బస్‌డిపోల నుంచి హైదరాబాద్, మోహిదిపట్నంతో పాటు మహబూబ్‌నగర్, సదాశివపేట, శంకర్‌పల్లి, వికారాబాద్, తాండూరు, పరిగి ప్రాంతాల కు పోలీస్ బందోబస్తు మధ్య ఆర్టీసీ బస్సులను నడిపించి ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి డిపోల నుంచి 206బస్సులు వివిధ ప్రదేశాలకు ప్రయాణికులను చేరవేశారు. వికారాబాద్ డిపోలో 82బస్సులు ఉండగా, 64బస్సులు, ఇందులో ఆర్టీసీ 40, ప్రైవేటు 24 బస్సు లు వివి ధ ప్రాంతాలకు తరిలి వెళ్లా యి. తాండూరు డిపోలో 93 బస్సులుండగా, 79 బస్సులు, ఇందులో ఆర్టీసీ 53 బస్సులు, ప్రైవేటు బస్సులు 24బస్సులు, రెండు స్కూల్ బస్సులు వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తరలించారు. పరిగి డిపోలో 87బస్సులుం డగా 63బస్సులు ఇందులో ఆర్టీసీ 43, ప్రైవేటు 20 బస్సులు వివిధ ప్రాం తాలకు నడిపి ప్రయాణికులకు సౌకర్యం కల్పించారు.

ఆర్టీసీ రేట్ల ప్రకారమే చార్జీలు వసూలు చేయాలి
ఆర్టీసీ రేట్ల ప్రకారమే ప్రయాణికుల నుంచి బస్ టికెట్ చార్జీలు వసూలు చేయాలని కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాలులో ప్రైవేటు బస్సు యాజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా మాట్లాడుతూ ఆర్టీసీ రేట్ల ప్రకారమే ప్రయాణికుల నుంచి ఛార్జీలు వసూలు చేయాలని తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మొత్తం 68 ప్రైవేటు బస్సులను డిపోల నుంచి బయలు దేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులను పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు సరైన విధంగా నడిపించాలని ఆర్టీసీ డివీఎంకు ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ డీవీఎం టి. రమేశ్, ప్రైవేటు బస్సుల యజమాన్యాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...