కల్యాణ కాంతులు


Tue,October 15, 2019 11:40 PM

వికారాబాద్ రూరల్ : కల్యాణలక్ష్మి పథకంతో పేదల ఇండ్లల్లో కల్యాణ కాం తులు విరజిల్లుతున్నాయని, ప్రభుత్వం పేదలకు బాసటగా నిలుస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని ఆయా కాలనీల్లో 23 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారుల కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభు త్వం పేదలకు పెన్నిధిగా ఉంటుందని, ప్రతి పథకం పేదలను దృష్టిలో పెట్టుకొని రూపొందించారని పేర్కొన్నారు. గతంలో కల్యాణలక్ష్మి పథకం రూ.51 వేల నుంచి రూ.1,00116కు పెంచడం జరిగిందన్నారు. దీంతో పేదింటి తల్లిదండ్రులు తమ ఆడపిల్లల పెండ్లిళ్లు ఘనంగా చేస్తున్నారన్నారు. కల్యాణలక్ష్మి చెక్కుల విషయంలో మధ్యవర్తి లేకుండా సరాసరి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందించడం జరుగుతుందన్నారు. అలాగే ప్రభుత్వం బ్యాంకు ఖాతా ద్వారా నేరుగా తమ ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. ఇవేకాకుండా రైతు బీమా, రైతు బంధుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. వృద్ధులకు, దివ్యాంగులకు పింఛన్లు పెంచి వారిని ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఒక్కొక్కరి కి 6 కిలోల చొప్పున బియ్యాన్ని అందిస్తున్నామన్నారు. బియ్యం తూకం వేసే విషయంలో మోసాలు జరుగకుండా ఎలక్ట్రికల్ కాంటాలతో తూకం వేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ దశరథ్, డిప్యూటీ తహసీల్దార్ యాదయ్య, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు ఆర్. నర్సింహులు, అనంత్‌రెడ్డి, రంగరాజు, శంకర్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles