ప్రజావాణి ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి


Tue,October 15, 2019 12:46 AM

-అర్జీదారులకు సత్వరం న్యాయం చేయాలి
-ప్రజావాణికి 108 ఫిర్యాదులు
-కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా

వికారాబాద్, నమస్తే తెలంగాణ : ప్రజావాణికి వచ్చే సమస్యలను త్వరగా పరిశీలించి ఫిర్యాదు దారులకు సరైన న్యాయం చేయాలని కలెక్టర్ మస్రత్‌ఖానమ్ ఆయేషా తెలిపారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ ప్రజావాణికి 108 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఇందులో డబుల్ బెడ్‌రూంలు కావాలని, భూ సమస్యలు, పింఛన్లు, విద్యుత్, జర్నలిస్టుల సమస్యలు తీర్చాలని ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మస్రత్‌ఖానమ్ ఆయేషా మాటాడారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపితే ఫిర్యాదులు రావడం తగ్గిపోతాయని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు వచ్చిన ఫిర్యాదులపై వెంట వెంటనే స్పందించి పరిష్కరించాలన్నారు. సమస్యలకు సత్వరం పరిష్కారం చేస్తే పరిపాలన యంత్రాంగంపై సరైన నమ్మకం కలుగుతుందని స్పష్టం చేశారు. అధికారులు నిర్లక్ష్యం చేయకుండా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అరుణకుమారి, డీఆర్‌వో మోతీలాల్, డీటీవో కోఠాజీ, మత్స్యశాఖ అధికారి దుర్గాప్రసాద్, డీవైఎస్‌వో హన్మంత్‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...