టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు


Tue,October 15, 2019 12:43 AM

వికారాబాద్, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రిపై గొప్ప నమ్మకంతో ఇతర పార్టీల నుంచి భారీగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మున్సిపల్ పరిధిలోని ఎంఐజీ కాలనీ, రామయ్యగూడకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేసి అభివృద్ధిలోకి తీసుకరావడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పారిపాలనకు ఆకర్శితులై కేసీఆర్‌పై గొప్ప నమ్మకంతో ఆయన నాయకత్వంలో పని చేసేందుకు ఇతర పార్టీలన్ని ఖాళీ అయి టీఆర్‌ఎస్ పార్టీలోకి రావడం జరుగుతుందని తెలిపారు. వికారాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీలు పూర్తిగా ఖాళీ అయిపోయి అయోమయంలో పడిపోయాయి. టీఆర్‌ఎస్ పార్టీలో భారీగా నాయకులు చేరడంతో మంచి జోష్‌తో రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదల పెండ్లిండ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో కొండంత అండగా నిలుస్తున్నారన్నారు.

అదే విధంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీటితో శుద్ధి జలాలు అందించి మహిళల కష్టాలు తీర్చిన మహనీయుడు కేసీఆర్ అన్నారు. రైతన్నలకు పంట పెట్టుబడి సహాయం, రైతు బీమా, గిట్టుబాటు ధరలు, 24గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ఇలా అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో నిలిచిపోతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నమ్మకంతో భారీగా టీఆర్‌ఎస్‌లోకి నాయకులు రావడం జరుగుతుందని తెలిపారు. వికారాబాద్‌లో ఇతర పార్టీలన్నీ ఖాళీ అయిపోయాయని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో రామయ్యగూడకు చెందిన దూళ్లపల్లి పాండు, ఎంఐజీకి చెందిన కిషోర్, 70 మంది కార్యకర్తలతో ఎమ్మెల్యే ఆనంద్ సమక్షంలో నాయకుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, విజయ్‌కుమార్, ఆర్.నర్సింహులు, ముత్యంరెడ్డి, మల్లేశ్, లక్ష్మణ్, శ్రీనివాస్, వెంకటేశ్, యాదగిరి, అశోక్ తదితరులు ఉన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...