వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకోవాలి


Mon,October 14, 2019 12:57 AM

-జిల్లా వ్యాప్తంగా వాల్మీకి మహర్షికి ఘన నివాళులు
-వెనుకబడిన కులాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
-పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
-మహర్షి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి
-బోయలు సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి
-జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనంద్,కలెక్టర్ ఆయేషా

వికారాబాద్, నమస్తేతెలంగాణ : వాల్మీకి మహార్షి మహనీయుడని ఆయనను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డా. మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం వికారాబాద్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వికారాబాద్ ఎమ్మెల్యే డా. మెతుకు ఆనంద్ మాట్లాడుతూ వాల్మీకి మహర్షి ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమన్నారు. మామూలు వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన రామాయణ మహాకావ్యాన్ని రాసి దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చేలా చేశారని గుర్తు చేశారు. వాల్మీకి మహర్షి గొప్ప ఆదికవి అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మనయొక్క మహానీయులు ఆదికవులు వారిని గుర్తించి ప్రభుత్వ పరంగా వేడుకలను జరిపిస్తుందన్నారు. వారి యొక్క చరిత్రలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండేందుకు ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. వెనుకబడిన కులాల అభివృద్ధికి ప్రభు త్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తుందన్నారు. గొల్ల కుర్మ, యాదవ, కుమ్మరి, చాకలి, నాయిబ్రాహ్మణ కుల వృత్తులను ప్రోత్సహించేందుకు అనేక పథకాలను రూపొందిస్తూ ప్రత్యేక ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తూ వారి ఆర్ధికాభివృద్దికి ఎంతగానో కృషి చేస్తుందన్నారు. వెనుకబడిన కులాలు ఆర్థికంగా విద్యాపరంగా అన్ని విధాలుగా ఎదిగేందుకు ప్రభుత్వం ఎన్నో వినూత్న కార్యక్రమాలను రూపొందిస్తూ ముందుకు సాగుతుందన్నారు.

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ సంక్షే మ పథకాలు అర్హులైన వారికి చేరినప్పుడే బంగారు తెలంగా ణ అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. మహార్షుల జన్మదిన వేడుకలు చేసుకోవడమే కాకుం డా వారి ఆశయాలు, ఆచరణలో కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొ న్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మస్రత్ ఖానమ్ అయేషా మాట్లాడుతూ మహర్షి వాల్మీకిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సామాజిక, సాంఘీక, ఆర్థికంగా వెనుకబడిన బోయ కులస్తులు సంఘాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అందజేస్తు న్న సంక్షేమ పథకాలను వినియోగించుకొని ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకోవాలన్నారు. విద్యాభివృద్ధి ద్వారానే వెనుకబాటు తనాన్ని మార్చవచ్చునన్నారు. తెలివి తేటలు అందరికి సమానంగా ఉంటాయని దానిని వినియోగించుకోవాలని సూచించారు. వెనుకబడిన కులాలకు చెందిన వారికి విద్యనభ్యసించేందుకు ప్రత్యేకంగా ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందన్నారు. ఉన్నత చదువులకై విదేశాలకు వెళ్లే వెనుకబడిన తరగతులకు చెందిన వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు.

వెనుకబడిన కులస్తులు కులాంతర వివాహాలు చేసుకుంటే వారికి ప్రోత్సాహంగా రూ. 10వేలను ప్రభు త్వం అందజేస్తుందన్నారు. వికారాబాద్ జిల్లాలో బీసీలు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు చదివేందుకు వీలుగా 7 వసతి గృహాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఈడబ్ల్యూ ఐడీసీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, రాష్ట్ర వైద్య మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేశ్‌కుమార్, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పాలత, పద్మశాలి సంఘం నాయకులు ఉట్ల బాలకిష్ట య్య, వివిధ సంఘాల నాయకులు హుండేకారి సత్యనారాయణ, రాములు, ప్యాట శంకర్, వెంకటేశం, రాజయ్య, బాలయ్య, సత్యనారాయణలతో పాటు తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...