న్యాయం జరిగేలా చూడాలి


Sun,September 22, 2019 12:30 AM

-ఎఫ్‌ఐఆర్‌లను త్వరగా కోర్టుకు అందజేయాలి
-పెండింగ్ కేసులు లేకుండా చూసుకోవాలి
-సమీక్ష సమావేశంలో ఎస్పీ నారాయణ

పరిగి, నమస్తే తెలంగాణ : బాధితులకు న్యాయం జరిగేలా పనిచేయాలని ఎస్పీ ఎం.నారాయణ పోలీసు అధికారులకు సూచించారు. శనివారం పరిగిలోని పోలీసు సర్కిల్ కార్యాలయంలో పరిగి పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌ల అధికారులతో ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఎం.నారాయణ మాట్లాడుతూ రోడ్డు ప్ర మాదాలు జరిగినప్పుడు అందుకు గల కారణాలను, సంబంధిత కేసులకు సంబంధించిన డాక్యుమెంట్‌లను పూర్తిగా తీసుకొని దర్యాప్తు చేసి నేరస్తులకు శిక్ష లు పడి, బాధితులకు న్యాయం జరిగే విధంగా పనిచేయాలని తెలిపారు. కేసులు నమోదు చేసిన వెంటనే ఎఫ్‌ఐఆర్‌లను కోర్టులో త్వరగా అందించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఆయా కేసులకు సంబంధించిన దర్యాప్తును ఇన్‌వెస్టిగేషన్ ఆఫీసర్లు త్వరగా పూర్తి చేసి చార్జీషీట్‌లను కోర్టులో అందజేసి, సీసీ నెంబర్లు తీసు కుని కేసులు పెండింగ్‌లో లేకుండా చూడాలని చెప్పా రు.

ఇప్పటి వరకు సబ్‌డివిజన్‌లో నమోదైన కేసులలో ఎన్ని చార్జిషీట్‌లను కోర్టుకు అందించడం జరిగింది, ఎన్ని కేసులలో చార్జీషీట్ వేయలేదు, అందుకు గల కారణాలను ఎస్పీ తెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేశారు. కేసులపై సమీక్ష జరిపి ఆన్‌లైన్‌కు, మ్యానువల్‌కు ఉన్న కేసుల వ్యత్యాసాలను గుర్తించి ఎందుకు అప్‌డేట్ చేయడం లేదని, అందుకు గల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే అప్‌డేట్ చేయాలని ఎస్పీ చెప్పారు. నేరాల నియంత్రణకు పోలీస్ స్టేషన్‌ల వారిగా తీసుకుంటున్న చర్యలను అడి గి తెలుసుకున్నారు. నేరాలు జరిగే ప్రాంతాలు, రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలు గుర్తించాలన్నారు. పాయింట్ బుక్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లు పెంచాలని ఎస్పీ ఆదేశించారు.

నేరాలు జరిగే ప్రాంతాలన్ని కవర్ అయ్యేలా పెట్రోలింగ్ విధులు నిర్వహించాలన్నారు. జిల్లాకు వచ్చిన ప్రొబేషనరీ ఎస్‌ఐలను జిల్లాలోని ఆయా పోలీస్‌స్టేషన్‌లకు ఎస్‌హెచ్‌వో శిక్షణలో భాగం గా కేటాయించడం జరిగిందని తెలిపారు. పరిగి సబ్ డివిజన్‌కు కేటాయించిన ప్రొబేషనరీ ఎస్‌ఐలు నమో దు చేసిన కేసులపై ప్రత్యేకంగా సమీక్షించి ఈ కేసులలో ఉన్న లోపాలు గుర్తించి సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ భాస్కర్, డీఎస్పీ రవీంద్రారెడ్డి, సీఐలు మొగులయ్య, నాగేశ్వర్‌రావు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...