ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలి


Thu,September 19, 2019 11:28 PM

పెద్దేముల్ : ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని మండల ఇన్‌చార్జి విద్యాధికారి జె.వెంకట య్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్ర భుత్వ జూనియర్ కళాశాల సమావేశ మందిరంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల పాఠశాలల్లో పనిచేస్తూ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 12 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వెం కటయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి గౌరవ ప్రదమైనదని, ఓ విద్యార్థి దశ, దిశను మార్చేది కేవలం ఉ పాధ్యాయులేనని పేర్కొన్నారు.

నవ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. విద్యార్థులకు పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే కాక ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఉపాధ్యాయు లు కృషి చేయాలన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వివిధ పాఠశాల ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అనురాధ, వైస్ ఎంపీపీ మధులత, జడ్పీటీసీ ధారాసింగ్, ఎంపీటీసీ పి.అంబరయ్య, మండల సీనియర్ అసిస్టెంట్ కృ ష్ణారావు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, నాయకు లు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...