అటవీ విస్తరణపై ప్రత్యేక దృష్టి


Thu,September 19, 2019 12:44 AM

-జిల్లాలోని 800 ఎకరాల అటవీ ప్రాంతంలో మొక్కలు
-ఇప్పటి వరకు 12.84 లక్షల మొక్కలు నాటిన
-అటవీశాఖఈ ఏడాది హరితహారంలో అడవుల పెంపునకు ప్రాధాన్యత
-జిల్లా వ్యాప్తంగా 9 శాతం మేర అటవీ ప్రాంతం
-హరితహారంలో 1.30కోట్ల మొక్కలు నాటడం పూర్తి
-22 వరకు హరిత లక్ష్యాన్ని పూర్తి చేయాలి
-ఎంపీడీవోలు, సర్పంచ్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో అటవీ ప్రాంత విస్తరణపై జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకుగాను అటవీ ప్రాంత విస్తీర్ణాన్ని పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. అయితే ప్రతి ఏడాది ఎంతో కొంతమేర అటవీ ప్రాంతంలో మొక్కలు నాటుతున్న అటవీ శాఖ యంత్రాంగం ఈ ఏడాది అధిక మొత్తంలో అటవీ ప్రాంతంలో మొక్కలను నాటారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 800ఎకరాల్లోని అటవీ ప్రాంతంలో హరితహారంలో భాగంగా టేకు మొక్కలతో పాటు చైనా బాదం, కానుగ, నమలి నార తదితర మొక్కలను నాటడం జరిగింది. జిల్లాలో ఎక్కడైతే అటవీ ప్రాంత విస్తీర్ణం తక్కువగా ఉందో సంబంధిత అటవీ ప్రాంతం లో మొక్కలు నాటడంపై జిల్లా అటవీ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. జిల్లాలోని అటవీ శాఖ ఐదు రేంజ్‌ల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఇప్పటివరకు 12.84 లక్షల మొక్కలను నాటడం పూర్తయ్యింది. అదేవిధంగా ఈ ఏడాది హరితహారంలో భాగంగా 2.66 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటివరకు 1.30 కోట్ల మొక్కలను నాటడం జరిగింది.

800ఎకరాల్లో నాటిన మొక్కలు
ఈ ఏడాది తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగం గా జిల్లావ్యాప్తంగా ఐదు రేంజ్‌ల పరిధిలోని 800ఎకరాల్లో మొక్కలు నాటారు. జిల్లాలోని తాండూర్, పరిగి, ధారూర్, కొడంగల్, వికారాబాద్ అటవీ శాఖ రేంజ్ పరిధిల్లో కల్కొడ, తట్టేపల్లి, అన్నాసాగర్, మైల్వార్, వెల్చాల్, బుగ్గ రామేశ్వరం సమీపంలోని అటవీ ప్రాంతంతోపాటు ఇతర అటవీ ప్రాంతాల్లో 12.84 లక్షల మొక్కలు నాటారు. తాండూర్ అటవీ శాఖ రేంజ్ పరిధిలోని అడికిచెర్ల, జిన్‌గుర్తి, నాగులపల్లి, మైల్వార్, అంతా రం, కల్కొడ, బంట్వారం, తట్టేపల్లి, గొట్టిగ, కొప్పన్‌కోట్ పరిధిలోని అటవీ ప్రాంతంలో 2.83 లక్షల మొక్కలు, పరిగి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఇబ్రహీంపూర్, మిట్టాకోడూర్, తిర్మలాపూర్, కిష్టాపూర్, ఊటుపల్లి, ముజాహిద్‌పూర్, పీరంపల్లి, కొత్తపల్లి, అనంతసాగర్, రంగంపల్లి, ఇప్పాయిపల్లి, బొంపల్లి, మహ్మదాబాద్, నస్కల్ పరిధిలోని అటవీ ప్రాంతంలో 3.29 లక్షల మొక్కలు, సంబంధిత అటవీ ప్రాంతాల్లో టేకు మొక్కలతో పాటు చైనా బాదం, కానుగ, నెమలి నార తదితర మొక్కలను నాటారు. కొడంగల్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అప్పాయిపల్లి, బొంరాస్‌పేట్, తుంకిమెట్ల, మెట్లకుంట, దుద్యాల్, దౌల్తాబాద్, కొత్తూరు, గుండెపల్లి, రేగడిమైల్వార్ పరిధిలోని అటవీ ప్రాంతం లో 1.82 లక్షల మొక్కలను, వికారాబాద్ ఫారెస్ట్ రేంజ్ పరిధి లో పులుమామిడి, మోత్కుపల్లి, ఎక్‌మామిడి, దుర్గంచెరువు, మున్నూరు సోమారం, బుగ్గ ఆలయం, వెల్చాల్, నాగసాన్‌పల్లి, తిప్పాపూర్, అనంతగిరి, మన్నెగూడ పరిధిలోని అటవీ ప్రాం తంలో 1.99 లక్షల మొక్కలను, ధారూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అల్లాపూర్, ధారూర్, చింతకుంట, రేగొండి, కొండాపూర్, నాగసముందర్, దోర్నాల్ పరిధిలోని అటవీ ప్రాంతంలో 2.89 లక్షల మొక్కలను నాటారు.

1.30 కోట్ల మొక్కలు నాటడం పూర్తి
తెలంగాణకు హరితహారం లో భాగంగా జిలా ్లవ్యాప్తంగా ఈ ఏడాది 2.66 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం జిల్లాకు లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 1.30 కోట్ల మొక్కలను నాటడం పూర్తయ్యింది. అయితే ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్‌లో 42 శాతం మేర జిల్లా యంత్రాంగం మొక్కలను నాటారు. మరోవైపు నాటిన ప్రతి మొక్కను జియోట్యాగింగ్ చేసే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అయితే హరితహారంలో భాగంగా అడవులను వదిలి గ్రామాలు, పొలాల్లోకి వస్తున్న కోతులకు అటవీ ప్రాంతంలోనే జీవనాధారంగా మంకీ ఫుడ్ కోర్టు ప్లాంటేషన్ చేపట్టేందుకు అటవీ శాఖ అధికారులు ప్రణాళికను రూపొందించారు. జిల్లాలో కోతులు ఎక్కువగా ప్రాంతాలకు సమీపంలోని అటవీ ప్రాంతంలో చైనా బాదం, జామ, చింత, సీతాఫలం, నేరేడు, చీమచింత, మేడిపండు తదితర మొక్కలతో ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేశారు. అదేవిధంగా ఈ ఏడాది ఆయా శాఖలు ఇప్పటివరకు నాటిన మొక్కలకు సంబంధించి అటవీ శాఖ ఆధ్వర్యంలో 12.84లక్షల మొక్కలు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 59.01 లక్షల మొక్కలు, విద్యాశాఖ ఆధ్వర్యంలో 3.01లక్షల మొక్క లు, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 2.32 లక్షల మొక్కలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 47,610 మొక్కలు, వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో 50,782 మొక్కలు, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో 1.61 లక్షల మొక్కలు, విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో 9900 మొక్కలు, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 21,040 మొక్కలు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 23.10 లక్షల మొక్కలు, వికారాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 31,475మొక్కలు, రెవె న్యూ శాఖ ఆధ్వర్యంలో 1.90 లక్షల మొక్కలు, మార్కెటింగ్ శాఖ 795 మొక్కలు, గనుల శాఖ ఆధ్వర్యంలో 56,400 మొక్కలు, మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో 4100 మొక్కలు, ఎస్సీ సంక్షేమ శాఖ 16,725 మొక్కలు, బీసీ సంక్షేమ శాఖ 21,030 మొక్కలు, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 1.68 లక్షల మొక్కలు, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 5200 మొక్కలు, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో 58,979 మొక్కలు, రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో 2 వేల మొక్కలు, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 1.07 లక్షల మొక్కలు, జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో 17.67 లక్షల మొక్కలు, తాండూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 7100 మొక్కలు, పరిగి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 13,300 మొక్కలు, కొడంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యం లో 10,550 మొక్కలు, ఆర్‌డబ్ల్యుఎస్ ఆధ్వర్యంలో 3000 మొక్కలు, సహకార శాఖ ఆధ్వర్యంలో 47,200 వేల మొక్కలు, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 48,991మొక్కలను నాటారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...