పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి


Thu,September 19, 2019 12:43 AM

వికారాబాద్ రూలర్ : గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు గ్రామ ప్రజలు సహకరించాలని డీఎల్‌పీవో అనిత అన్నారు. బుధవారం వికారాబాద్ మండల పరిధిలోని గొదుమగూడ గ్రామాన్ని 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాన్ని సందర్శించారు. అలాగే గ్రామం మొత్తం తిరుగుతూ ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. గ్రామంలో తడి, పొడి చెత్త సేకరణ గదులను పరిశీలించారు. గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణంను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎల్‌పీవో అనిత మాట్లాడుతూ.. 30 రోజుల ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. గ్రామంలో అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలను శుభ్రం చేయాలని సూచించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటి వద్ద ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలన్నారు. గ్రామం పరిశుభ్రంగా ఉంటే ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేసే అవకాశం ఉంటుందన్నారు. గ్రామంలో మహిళలు తమ ఇంటిలోని చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి అందించాలని, దాని ద్వారా తడి, పొడి చెత్త గదులకు తరలించడం జరుగుతుందన్నారు. గొదుమగూడ గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనితాసత్యనారయణగౌడ్, ఉప సర్పంచ్ నర్సింహులు, గ్రామ కార్యదర్శి స్వాతి, ప్రత్యేకాధికారి రవి, గ్రామస్తులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...