మాతా శిశు సంరక్షణకు చర్యలు తీసుకోవాలి


Wed,September 18, 2019 12:04 AM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : ఆరోగ్యం, పరిశుభ్రతపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా లో పిల్లల లింగ నిష్పత్తిపై మహిళ శిశుసంక్షేమం వైద్య, ఆరో గ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి, బాలల సంరక్షణ విభాగం, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పిల్లల లింగనిష్పత్తి విషయంలో ప్రతి వెయ్యి మందిలో 975సగటుతో జిల్లా మెరు గ్గా ఉందని తెలిపారు. కాని జిల్లాలోని 4మండలాల్లో పూ డూరు, నవాబుపేట, కులకచర్ల, బషీరాబాద్ మండలాల్లో కాస్త తక్కువగా ఉందని తెలిపారు. ఈ మండలాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. మహిళ శిశుసంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో పని చేయాలని తెలిపారు. దృశ్య శ్రావణ పరికరాల ద్వారా, కరపత్రాల ద్వారా కళాజాత బృందాలతో సమస్యాత్మక మండలాల్లోని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఆరోగ్యం పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ ప్రజలకు పీసీపీఎన్‌డీటీ చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. మాతా శిశువు రక్షణ వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, కార్యక్రమాల గురించి స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. కిషోర బాలికలకు ఆరోగ్యం, పరిశుభ్రతపై వివరించాలన్నారు. మహిళలకు, బాలికలకు ఆరోగ్య క్యాంపులు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారికి కలెక్టర్ సూచించారు. అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఆ రోజు కులకచర్ల, బషీరాబాద్ మండలాల్లో మహిళ శిశు సంక్షేమం, వైద్యం ఆరోగ్యం, విద్యా గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయంతో జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాలు, సమావేశాలు ఏర్పా టు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా మహిళ శిశుసంక్షేమాధికారి జోత్స్న, డీఎంహెచ్‌వో సుధాకర్, డీఈవో రేణుకాదేవి, బాలల పరిరక్షణ సిబ్బంది డీఆర్‌డీఏ పీడీఎం స్వచ్ఛంద సంస్థల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...